Breaking News

ఇంగ్లండ్‌ చేతిలో పరాభవం.. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ

Published on Mon, 01/29/2024 - 08:29

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఘోర పరాభవాన్ని ఎదుర్కొని బాధలో ఉన్న టీమిండియాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి అనంతరం విడుదల చేసిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. 

ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియా ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒక డ్రా, రెండు పరాజయాలు, రెండు విజయాలు నమోదు చేసింది. ఈ సైకిల్‌లో టీమిండియా విజయాల శాతం 43.33 శాతంగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఆరు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు, రెండింట్లో అపజయాలు, ఓ మ్యాచ్‌ డ్రా చేసుకుని 29.16 విజయాల శాతంతో ఎనిమిదో స్థానంలో ఉంది. 

కాగా, టెస్ట్‌ క్రికెట్‌లో నిన్న రెండు ఊహించని ఫలితాలు వచ్చాయి. తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ కలిగి కూడా టీమిండియా ఇంగ్లండ్‌ చేతిలో చిత్తు కాగా.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా సొంతగడ్డపై చిన్న జట్టైన వెస్టిండీస్‌  చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఆసీస్‌ విండీస్‌ చేతిలో ఓడినా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. సంచలన విజయంతో ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో బోణీ కొట్టిన విండీస్‌ ఏడో స్థానానికి ఎగబాకింది.

ఆసీస్‌ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆరో ప్లేస్‌లో పాకిస్తాన్‌, తొమ్మిదో స్థానంలో శ్రీలంక జట్లు ఉన్నాయి. 

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌ స్కోర్‌ వివరాలు..
ఇంగ్లండ్‌: 246 & 420
భారత్‌: 436 & 202
28 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ విజయం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)