Breaking News

ఫిఫా వరల్డ్‌కప్‌ హీరో.. ముందుగా భారత్‌లోనే మెరిశాడు!

Published on Mon, 07/20/2026 - 09:28

ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో స్పెయిన్‌ యువ సంచలనం లమీన్‌ యామల్‌ ఆది నుంచి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనతో జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు ఈ టీనేజర్‌.

ముఖ్యంగా ఫ్రాన్స్‌తో సెమీ ఫైనల్లో కీలక సమయంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి.. అతి పిన్న వయసులోనే వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, అర్జెంటీనాతో ఫైనల్లో మాత్రం ఫెరాన్‌ టోరెస్‌ స్పెయిన్‌ హీరోగా అవతరించాడు.

అదనపు సమయంలోని 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి గోల్‌ కొట్టి స్పెయిన్‌ను గెలిపించాడు టోరెస్‌. నికో విలియమ్స్‌ ఇచ్చిన హెడర్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనా ఆశలపై నీళ్లు చల్లాడు. తద్వారా స్పెయిన్‌ వరల్డ్‌కప్‌ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు.

ఎవరీ టోరెస్‌?
26 ఏళ్ల టోరెస్‌ బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌లో ఫార్వర్డ్‌ ప్లేయర్‌​. స్పెయిన్‌లోని ఫెయెస్‌లో 2000, ఫిబ్రవరి 29న జన్మించాడు. ఆరేళ్ల వయసులోనే వాలెన్షియా అకాడమీలో చేరాడు. యూత్‌ జట్టు తరఫున రాణించి.. 2017లో సీనియర్‌ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. వాలెన్షియా తరఫున2017- 2020 మధ్యలో 71 మ్యాచ్‌లలో ఆరు గోల్స్‌ సాధించాడు.

మాంచెస్టర్‌ సిటీ తరఫున 2020-2022 మధ్య కాలంలో 28 మ్యాచ్‌లలో తొమ్మిది గోల్స్‌ కొట్టిన టోరెస్‌.. ప్రీమియర్‌ లీగ్‌, ఈఎఫ్‌ఎల్‌ కప్‌ గెలిచిన జట్టులు సభ్యుడు.

ఇక ఆ తర్వాత అంటే 2021-22 సీజన్లో బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌లో చేరాడు టోరెస్‌. లా లిగా, కోపా డెల్‌ రెయ్‌, సూపర్‌కోపా కప్పులు గెలిచాడు. ప్రస్తుతం పారిస్‌ సెయింట్‌ జర్మేన్‌ జట్టుకు ఆడుతున్నాడు.

భారత్‌లోనే ముందుగా మెరిశాడు
స్పెయిన్‌ అండర్‌-17 జట్టు తరఫున 2017లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీలో టోరెస్‌ పాల్గొన్నాడు. స్పెయిన్‌ జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఇంగ్లండ్‌తో టైటిల్‌ పోరులోనూ సత్తా చాటాడు.

కోల్‌కతాలో ఇంగ్లండ్‌- స్పెయిన్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగగా.. ఇంగ్లండ్‌ 5-2 గోల్‌ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. దీంతో స్పెయిన్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ టోర్నీ గ్రూప్‌ దశలో స్పెయిన్‌ మూడు విజయాలు సాధించింది. అనంతరం నాకౌట్‌ దశలో ఫ్రాన్స్‌, మాలి జట్లపై గెలిచింది.

ఈ ఈవెంట్లో టోరెస్‌ రెండు గోల్స్‌ కొట్టడంతో పాటు.. రెండు అసిస్ట్‌లు ఇచ్చి తన వంతు పాత్ర పోషించాడు. కాగా టోరెస్‌ స్పెయిన్‌ తరఫున 2020లో అరంగేట్రం చేశాడు. అండర్‌-17, 19, 21 స్థాయిల్లో ఆడి ఈ స్థాయికి చేరుకున్నాడు. 

ముద్దుపేరు తెలుసా?
ఇక లీప్‌ సంవత్సరంలో జన్మించిన టోరెస్‌ నాలుగేళ్లకోసారి తన పుట్టినరోజు జరుపుకొంటాడు. అతడి ముద్దుపేరు ‘ది షార్క్‌’. గోల్‌ కొట్టినపుడు అతడు షార్క్‌ ఫిన్‌ (షార్క్‌ వెనుక భాగంలో కనిపించే త్రికోణాకారపు రెక్క లాంటిది) సింబాలిక్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడమే ఇందుకు కారణం. షార్క్‌ ఫిన్‌ను శక్తి, ప్రత్యేక గుర్తింపు, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తారు. నీటి మీద ఫిన్‌ కనిపిస్తే అది ప్రమాద సూచనగా భావిస్తారు. తన ముద్దుపేరు మీదుగా టోరెస్‌ ఓ క్లాత్‌ బ్రాండ్‌ కూడా తీసుకువచ్చినట్లు సమాచారం.

చదవండి: గోల్డెన్‌ బూట్‌, గోల్డోన్‌ గ్లోవ్‌, గోల్డెన్‌ బాల్‌.. ప్రైజ్‌ మనీ ఉంటుందా?

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)