Breaking News

ప్రపంచకప్‌కు ముందే సౌతాఫ్రికాతో భారత్‌ 'ఢీ'

Published on Sun, 01/25/2026 - 19:16

టీ20 ప్రపంచకప్‌కు ముందే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా గతేడాది రన్నరప్‌ సౌతాఫ్రికాతో తలపడనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పోరు రెగ్యులర్‌ మ్యాచ్‌లా కాకుండా వార్మప్‌ మ్యాచ్‌గా జరుగనుంది. ప్రపంచకప్‌కు ముందు ఇదొక్కటే వార్మప్‌ మ్యాచ్‌ అని సమాచారం.

వాస్తవానికి ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలకు ముందు వార్మప్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే బంగ్లాదేశ్‌ కిరికిరి ఉండటంతో ఫైనల్‌ షెడ్యూల్‌ ఆలస్యమైంది. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌లో ఆడనుండటంతో షెడ్యూల్‌ మార్చాల్సి వచ్చింది.

భారత్‌-సౌతాఫ్రికా వార్మప్‌ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. బీసీసీఐ, క్రికెట్‌ సౌతాఫ్రికా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే, భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ జనవరి 31న తిరువనంతపురంలో జరగనుంది. ఈ సిరీస్‌ తర్వాత టీమిండియా ఫిబ్రవరి 3న ముంబైలో కలుస్తుంది. సౌతాఫ్రికాతో వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 4న ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరుగనున్నట్లు సమాచారం.

ప్రపంచకప్‌ మెయిన్‌ షెడ్యూల్‌ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుంది. కొలొంబో వేదికగా జరిగే పాకిస్తాన్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు ముంబైలోని వాంఖడే వేదికగా యూఎస్‌ఏతో ఆడనుంది.

భారత్‌.. యూఎస్‌ఏ, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌, నమీబియాతో పాటు గ్రూప్‌-ఏలో ఉంది. మిగతా గ్రూప్‌ మ్యాచ్‌లు ఫిబ్రవరి 12 (నమీబియాతో ఢిల్లీలో), 15 (పాకిస్తాన్‌తో కొలొంబోలో), 18  (నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్‌లో) తేదీల్లో జరుగనున్నాయి.

దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు కెనడా, ఆఫ్ఘనిస్తాన్‌, న్యూజిలాండ్‌, యూఏఈలతో కలిసి గ్రూప్‌-డిలో ఉంది. దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 9న అహ్మదాబాద్‌లో కెనడాతో ఆడనుంది.  

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)