Breaking News

సూర్యకుమార్‌ ‘ప్రాక్టీస్‌’

Published on Tue, 10/11/2022 - 05:44

పెర్త్‌: ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితులకు అలవాటు పడేందుకు అన్ని జట్లకంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత్‌ తమ సన్నాహాలను సంతృప్తిగా మొదలు పెట్టింది. మూడు రోజుల సాధన అనంతరం సోమవారం మ్యాచ్‌ బరిలోకి దిగిన టీమిండియా తొలి పోరులో విజయం సాధించింది. ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ 13 పరుగుల తేడాతో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ (35 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. ఇతర బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్యా (27; 1 ఫోర్, 1 సిక్స్‌), దీపక్‌ హుడా (22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించగా... రోహిత్‌ (3), ఓపెనర్‌గా ఆడిన పంత్‌ (9) విఫలమయ్యారు. అనంతరం వెస్ట్రన్‌   ఆస్ట్రేలియా 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్‌‡్షదీప్‌ 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా... చహల్, భువనేశ్వర్‌ చెరో 2 వికెట్లు తీశారు.

Videos

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)