Breaking News

టీమిండియా వరల్డ్‌ రికార్డు

Published on Sun, 02/01/2026 - 09:49

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు టీమిండియా భీకర ఫామ్‌లో ఉంది. ఈ మెగా టోర్నీ సన్నాహల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ అదరగొట్టింది. ఈ సిరీస్‌ను 4-1 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. శనివారం తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి టీ20లోనూ టీమిండియా దుమ్ములేపింది.

కివీస్‌ను 46 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.  వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 61) సైతం సత్తాచాటాడు. 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ ఆఖరివరకు పోరాడింది.  ఓపెనర్ ఫిన్ అలెన్ (38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్‌తో విరుచుకుపడ్డ టీమిండియా పలు అరుదైన రి​కార్డులను తమ ఖాతాలో వేసుకుంది.

ఇంగ్లండ్ వరల్డ్ రికార్డు బ్రేక్‌..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు 250 ప్లస్ పరుగులు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీమిండియా ఇప్పటివరకు నాలుగు సార్లు 250 పైగా పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే(3) రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది. అదేవిధంగా ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు(69) కొట్టిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట(64) ఉండేది.
చదవండి: 'స్కై' మ‌ళ్లీ నీలి రంగులోకి మారింది.. చాలా సంతోషంగా ఉంది: సూర్య

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)