Breaking News

నాలుగో టెస్టులో రిష‌బ్ పంత్ ఆడుతాడా? కీల‌క్ అప్‌డేట్ ఇచ్చిన కోచ్‌

Published on Thu, 07/17/2025 - 20:32

ఇంగ్లండ్‌తో మాంచెస్ట‌ర్ వేదిక‌గా జూలై 23 నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో త‌ల‌ప‌డేందుకు టీమిండియా సిద్ద‌మైంది. ఈ మ్యాచ్ కోసం భార‌త జ‌ట్టు బెకెన్‌హామ్‌లో త‌మ ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టింది. గురువారం తొలి ప్రాక్టీస్ సెష‌న్‌లో గిల్ సేన తీవ్రంగా శ్ర‌మించింది. అయితే ఈ ప్రాక్టీస్ సెష‌న్‌కు టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ దూర‌మ‌య్యాడు.

లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టులో పంత్ చేతి వేలికి గాయ‌మైంది. దీంతో అత‌డి స్ధానంలో ధ్రువ్ జురెల్ స‌బ్‌స్ట్యూట్ వికెట్ కీప‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్న పంత్‌.. రెండు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు మాత్రం వ‌చ్చాడు. 

తీవ్ర‌మైన నొప్పితో బాధ‌ప‌డుతూనే బ్యాటింగ్ చేశాడు. ఈ క్ర‌మంలో నాలుగో టెస్టుకు పంత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్ర‌స్తుతం ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. తాజాగా పంత్ గాయంపై భార‌త అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌డెష్కాట్ అప్‌డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధ‌ప‌డుతున్నాడ‌ని, మాంచెస్టర్ టెస్ట్ స‌మ‌యానికి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని టెన్‌డెష్కాట్ థీమా వ్య‌క్తం చేశాడు.

"మాంచెస్టర్‌లో జ‌రిగే నాలుగో టెస్టుకు ముందు పంత్ త‌న బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను మొద‌లు పెడ‌తాడు. ఆ స‌మ‌యానికి అత‌డు క‌చ్చితంగా ఫిట్‌నెస్ సాధిస్తాడ‌న్న న‌మ్మ‌కం ఉంది. అత‌డు మూడో టెస్టులో చాలా నొప్పితో బ్యాటింగ్ చేశాడు. ఆ త‌ర్వాత అత‌డి చేతి వేలి నొప్పి కాస్త త‌గ్గింది.

కానీ ముందుస్తు జాగ్ర‌త్త‌గా ప్ర‌స్తుతం అత‌డు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. వికెట్ కీపింగ్ చేయ‌గ‌ల‌డా లేదా అన్న‌ది ఆఖ‌రిలో మేము నిర్ధారించుకుంటాము. మ‌రోసారి ఇన్నింగ్స్ మధ్యలో కీపర్‌ను మార్చాల్సిన పరిస్థితి రాకూడ‌దు.  పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే పంత్‌నే బ్యాటింగ్‌, వికెట్ కీపింగ్ రెండూ చేస్తాడు. రాబోయే రోజుల్లో అత‌డి ఫిట్‌నెస్‌పై క‌చ్చితంగా అప్‌డేట్ ఇస్తామ‌ని" విలేక‌రుల స‌మావేశంలో డెష్కాట్ పేర్కొన్నాడు.
చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)