Breaking News

IND VS AUS: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. బ్యాటింగ్‌లో తడబడినా..!

Published on Wed, 09/24/2025 - 18:15

ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో (India A vs Australia A) భారత-ఏ బౌలర్లు చెలరేగిపోయారు. అంతకుముందు బ్యాటింగ్‌లో తడబడినా, బౌలింగ్‌లో మాత్రం చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధికి 226 పరుగుల భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టినా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు చుక్కలు చూపించారు.

రెండో రోజు చివర్లో బౌలింగ్‌కు దిగి కేవలం 7.5 ఓవర్లలో ముగ్గురు ఆసీస్‌ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపారు. 3 పరుగుల వద్దనే ఓపెనర్ల పని పట్టి, మరో 13 పరుగుల తర్వాత నాలుగో నంబర్‌ ఆటగాడిని ఔట్‌ చేశారు. ఫామ్‌లో ఉన్న సామ్‌ కొన్‌స్టాస్‌ను (3) గుర్నూర్‌ బ్రార్‌.. మరో ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌ కెల్లావేను (0) సిరాజ్‌ (Mohammed Siraj).. ఒలివర్‌ పీక్‌ను (1) మానవ్‌ సుతార్‌ ఔట్‌ చేశారు.

ఫలితంగా ఆసీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని ఆ జట్టు లీడ్‌ 242 పరుగులుగా ఉంది. కెప్టెన్‌ నాథన్‌ మెక్‌స్వీని (11) క్రీజ్‌లో ఉన్నాడు.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. ఆసీస్‌ సాధించిన 420 పరుగుల భారీ స్కోర్‌కు బదులిచ్చే క్రమంలో 194 పరుగులకే ఆలౌటైంది. సాయి సుదర్శన్‌ (Sai Sudharsan) (75) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. ఎన్‌ జగదీసన్‌ (38), ఆయుశ్‌ బదోని (21), ప్రసిద్ద్‌ కృష్ణ (16 రిటైర్డ్‌ హర్ట్‌), కేఎల్‌ రాహుల్‌(KL Rahul) (11) రెండంకెల స్కోర్లు చేశారు.  ​ఆసీస్‌ బౌలర్లలో థార్న్‌టన్‌ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. మర్ఫీ 2, సదర్‌ల్యాండ్‌, రొచ్చిక్కియోలీ, కన్నోల్లీ తలో వికెట్‌ తీశారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. మెక్‌స్వీనీ (74), జాక్‌ ఎడ్వర్డ్స్‌ (88), మర్ఫీ (76) అర్ద సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్‌ చేసింది. భారత బౌలర్లలో మానవ్‌ సుతార్‌ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. గుర్నూర్‌ బ్రార్‌ 3, సిరాజ్‌, ప్రసిద్ద్‌ తలో వికెట్‌ తీశారు.

కాగా, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌, 3 మ్యాచ్‌ల అనధికారిక​ వన్డే సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇదివరకే తొలి టెస్ట్‌ మ్యాచ్‌ పూర్తి కాగా.. ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

చదవండి: IND vs AUS: దారుణంగా విఫలమైన భారత జట్టు.. ఆసీస్‌కు భారీ ఆధిక్యం

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)