Breaking News

పంత్‌ రీఎంట్రీ.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Published on Thu, 10/30/2025 - 09:46

ఇటీవలి ఇంగ్లండ్‌ పర్యటనలో తీవ్రంగా గాయపడిన (పాదం) టీమిండియా ఆటగాడు రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) మూడు నెలల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా-ఏతో (India A vs South Africa A) ఇవాళ (అక్టోబర్‌ 30) ప్రారంభమైన తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్‌లో పంత్‌ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్‌-1లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ ఎక్కడా ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున సాయి సుదర్శన్, ఆయుశ్‌ మాత్రే, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ లాంటి అప్‌ కమింగ్‌ బ్యాటర్లు బరిలోకి దిగారు.

ఈ పర్యటనలో సౌతాఫ్రికా-ఏ, భారత్‌-ఏ జట్ల మధ్య 2 అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు, 3 అనధికారిక వన్డేలు జరుగనున్నాయి. రెండో టెస్ట్‌ కూడా బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్‌-1లోనే జరుగనుండగా.. మూడు వన్డేలకు రాజ్‌కోట్‌ ఆతిథ్యమివ్వనుంది. 

తుది జట్లు.. 
ఇండియా-A: సాయి సుదర్శన్, ఆయుశ్‌ మాత్రే, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, తనుష్ కోటియన్, అన్షుల్ కాంబోజ్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్

దక్షిణాఫ్రికా-A: మార్క్వెస్ అకెర్‌మాన్ (సి), జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, జుబేర్ హంజా, రూబిన్ హెర్మాన్, రివాల్డో మూన్‌సామి (w), టియాన్ వాన్ వురెన్, ప్రేనెలాన్ సుబ్రాయెన్, త్షెపో మోరేకి, లూథో సిపమ్లా, ఒకుహ్లే సెలె

చదవండి: మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి పోలార్డ్‌, పూరన్‌

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)