మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రిప్లై
Breaking News
అతడిని ముట్టుకున్నా.. జింబాబ్వే యువతి సంతోషం! ఫిదా చేసిన భారత క్రికెటర్!
Published on Fri, 08/19/2022 - 15:27
India Vs Zimbabwe 1st ODI- Deepak Chahar: తమకు ఇష్టమైన క్రికెటర్‌ను నేరుగా చూస్తేనే చాలు జన్మ ధన్యమైపోయిందనుకునే వీరాభిమానులు చాలా మందే ఉంటారు. మరి ఏకంగా ఆ ఆటగాడు తమ దగ్గరికి రావడం.. భుజం మీద చేయి వేసుకుని మరీ ఫొటో దిగే ఛాన్స్ ఇస్తే! ఎగిరి గంతేయడం ఖాయం! జింబాబ్వే యువతులు ముగ్గురు ప్రస్తుతం ఇలాంటి ఆనందంలో మునిగిపోయారు.
ఇటు అద్భుతమైన బంతులతో మైదానంలో బ్యాటర్లను.. అటు హుందాతనంతో అభిమానులను బౌల్డ్ చేసిన ఆ ఆటగాడు దీపక్ చహర్. కాగా గాయం కారణంగా ఆర్నెళ్ల పాటు జట్టుకు దూరమైన చహర్.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌తో తిరిగి ఎంట్రీ ఇచ్చాడు.
అద్భుతమైన బౌలింగ్‌తో!
ఈ క్రమంలో హరారే వేదికగా గురువారం(ఆగష్టు 18) నాటి మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. అలా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు చహర్. ఈ నేపథ్యంలో ఈ టీమిండియా స్టార్‌తో ఫొటోలు దిగాలని కొంతమంది యువతులు భావించారు.
PC: BCCI
ఇందుకు నవ్వుతూ అంగీకరించిన దీపక్ చహర్.. తన భుజంపై చేయి వేసి ఫొటో దిగాలనుకున్న వారి అభ్యర్థనను కాదనలేకపోయాడు. దీంతో వాళ్లు సంతోషంగా ఈ పేసర్‌తో ఫొటోలు దిగి ఆనందడోలికల్లో తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్టు విమల్ కుమార్ తన యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
తనను తాకే అవకాశం ఇచ్చాడు!
ఇక ఈ విషయం గురించి చహర్‌తో ఫొటో దిగిన ఓ మహిళాభిమాని మాట్లాడుతూ.. ‘‘చహర్ ఎంతో అణకువ గల వ్యక్తి. తనతో ఇలా ఫొటో దిగడం చాలా చాలా సంతోషంగా ఉంది. తనను తాకే అవకాశం నాకు ఇవ్వడమంటే మామూలు విషయం కాదు(నవ్వులు).. ఎందుకంటే చాలా మంది ఇతరులు తమను తాకడానికి ఏమాత్రం ఇష్టపడరు. అయితే, అతడు మాత్రం మమ్మల్ని నిరాశకు గురిచేయకుండా హుందాగా వ్యవహరించాడు’’ అని చెప్పుకొచ్చింది.
ఇక అభిమానులతో మమేకం కావడంపై దీపక్ చహర్ స్పందిస్తూ.. ‘‘నాకు ఆనందంగా ఉంది. మాతృ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడటం అనే చిన్ననాటి కల నెరవేరింది. మరి ఫ్యాన్స్‌తో ఇలా కలిసిపోవడం కూడా కూడా గొప్పగానే ఉంటుంది కదా!’’ అని పేర్కొన్నాడు.
చదవండి: Deepak Chahar: చాలా కాలం దూరమైతే అంతే! ప్రపంచకప్ జట్టుకు ఎంపికవడం నా చేతుల్లో లేదు!
Rohit Sharma: రోహిత్ శర్మ నిర్లక్ష్యపు షాట్లు ఆడేవాడు.. అందుకే అలా: దినేశ్ కార్తిక్
Tags : 1