Breaking News

నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?

Published on Thu, 07/23/2026 - 18:18

టీమిండియాతో తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు తేలిపోయారు. భారత బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు వరుస కట్టారు. దీంతో ఆతిథ్య జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌- జింబాబ్వే మధ్య గురువారం నాటి తొలి మ్యాచ్‌కు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదిక. 

తొలి బంతికే వికెట్‌
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. జింబాబ్వే బ్యాటింగ్‌కు దిగింది. మయాంక్‌ యాదవ్‌ భారత బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించి.. తొలి బంతికే బ్రియాన్‌ బెన్నెట్‌ను డకౌట్‌ చేశాడు.

మరో ఓపెనర్‌, అరంగేట్ర ఆటగాడు బెన్‌ కర్రాన్‌ (10) ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో అవుట్‌ కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ డియోన్‌ మైర్స్‌ (6)ను మయాంక్‌ యాదవ్‌ వెనక్కి పంపాడు. కెప్టెన్‌ సికిందర్‌ రజా (4) వికెట్‌ను శివం దూబే తన ఖాతాలో వేసుకోగా.. నిలకడగా ఆడుతున్న ర్యాన్‌ బర్ల్‌ (26)ను రవి బిష్ణోయి వెనక్కి పంపాడు.

రాణించిన మెధెవెరె
ఈ క్రమంలో వెస్లే మెధెవెరె ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. ఆరో స్థానంలో వచ్చిన ఈ ఆల్‌రౌండర్‌.. 34 బంతుల్లో 39 పరుగులతో జింబాబ్వే ఇన్నింగ్స్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ అతడు రనౌట్‌ అయ్యాడు. మిగతా వాళ్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ డకౌట్‌ కాగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ తాడివనాషే మరుమాణి (20 బంతుల్లో 27) కాస్త వేగంగా ఆడాడు. 

జింబాబ్వే స్కోరెంతంటే?
న్యూమన్‌ ఒక్క పరుగు చేసి మరుమాణితో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. శివం దూబే, రవి బిష్ణోయి తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. 

చదవండి: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)