IND vs ZIM: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం

Published on Thu, 07/23/2026 - 16:26

జింబాబ్వేతో తొలి టీ20 సందర్భంగా అశోక్‌ శర్మ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా ఈ ఫాస్ట్‌ బౌలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సీనియర్లను పక్కనపెట్టిన యాజమాన్యం.. పేస్‌ దళంలో మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌ వంటి యువ క్రికెట్లతో పాటు తొలిసారి అశోక్‌ శర్మను ఎంపిక చేసింది.

ఎవరీ అశోక్‌ శర్మ?
రాజస్తాన్‌లోని జైపూర్‌కి సమీపంలో గల రాంపుర అనే గ్రామంలో 2002లో జన్మించాడు అశోక్‌ శర్మ. అతడి తండ్రి సాధారణ రైతు. కుటుంబ పరిస్థితి ఆర్థికంగా అంతంత మాత్రమే. అయినప్పటికీ అశోక్‌తో పాటు అతడి అన్న అక్షయ్‌ శర్మ కూడా క్రికెటర్‌ కావాలనే కలలు కన్నాడు.

జిల్లా స్థాయిలో అక్షయ్‌ ఆడాడు. అయితే, తమ్ముడి కోసం తన కెరీర్‌ను త్యాగం చేశాడు. దీంతో అశోక్‌కు మార్గం సుగమమైంది. ఈ విషయం గురించి అశోక్‌ శర్మ స్వయంగా జాతీయ మీడియాకు వెల్లడించాడు.

లీడింగ్‌ వికెట్‌ టేకర్‌
కుటుంబ సహకారంతో తన కలలను నిజం చేసుకునే క్రమంలో అశోక్‌ శర్మ.. 2025-26 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ దేశీ టీ20 టోర్నీ తాజా ఎడిషన్‌లో పది మ్యాచ్‌లలో కలిపి 22 వికెట్లు కూల్చి..  లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. గంటకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేయగల సత్తా ఉన్న అశోక్‌ శర్మ.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు.

ఫాస్టెస్ట్‌ బాల్‌
ఈ క్రమంలో ఐపీఎల్‌-2026 వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ అశోక్‌ను రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది. ఆకాశ్‌ నెహ్రా మార్గదర్శనంలో అతడు రాటుదేలాడు. ఈ ఏడాది రాజస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా గంటకు 154.2 కిలో మీటర్లకు పైగా వేగంతో బంతిని విసిరి హాట్‌ టాపిక్‌గా మారాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌ ఆరు వికెట్లు దక్కించుకున్నాడు.

 ఈ నేపథ్యంలోనే తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన 24 ఏళ్ల అశోక్‌ శర్మ.. తాజాగా అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో తొలి టీ20లో భారత్‌ ముగ్గురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. 

తుదిజట్టులో ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌లతో పాటు అశోక్‌ శర్మ కూడా పేస్‌ విభాగంలో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. జింబాబ్వే తరఫున బెన్‌ కర్రాన్‌ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు.

తుదిజట్లు
భారత్‌
వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్

జింబాబ్వే
బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి (వికెట్ కీప‌ర్‌), బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్‌), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)