Breaking News

Ind Vs WI: విండీస్‌ విధ్వంసకర వీరుడు.. కోటీశ్వరుడు! ఖరీదైన కార్లు.. ఆస్తి?

Published on Thu, 08/03/2023 - 16:54

Nicholas Pooran's Lavish Lifestyle: టెస్టు, వన్డే సిరీస్‌లలో టీమిండియా చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్‌.. టీ20 సిరీస్‌లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ట్రినిడాడ్‌లోని తరూబాలో గల బ్రియన్‌ లారా స్టేడియంలో గురువారం యువ భారత జట్టుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 

ఐదు టీ20ల సిరీస్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న విండీస్‌కు విధ్వంసర ఆటగాడు‌ నికోలస్‌ పూరన్‌తో పాటు జేసన్‌ హోల్డర్‌ రాక బలంగా మారింది. కాగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌.. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2023 ఫైనల్లో ఆడిన సునామీ ఇన్నింగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీకి చెందిన ఎంఐ న్యూయార్క్‌కు ప్రాతినిథ్య వహించిన పూరన్‌ ఏకంగా 10 ఫోర్లు, 13 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 55 బంతుల్లో 137 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు.

కోటీశ్వరుడే!
పూరన్‌ ఆట సంగతి ఇలా ఉంటే.. అతడి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. కరేబియన్‌ దీవికి చెందిన ధనవంతులైన క్రికెటర్లలో పూరన్‌కూ చోటుంది. ఈ ఏడాది హయ్యస్ట్‌ పెయిడ్‌ విండీస్‌ క్రికెటర్ల జాబితాలో అతడు స్థానం సంపాదించాడు.

ఐపీఎల్‌ ద్వారా అధికాదాయం
ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ 2023 వేలంలో భాగంగా అత్యధికంగా ఈ హిట్టర్‌ కోసం ఏకంగా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. క్యాష్‌ రిచ్‌ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీపీఎల్‌, మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ తదితర లీగ్‌లలో పూరన్‌ ఆడుతున్నాడు.

అదే విధంగా.. పూమా, నైకీ తదితర ప్రముఖ బ్రాండ్లను ఎండార్స్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో నికోలస్‌ పూరన్‌ నెట్‌వర్త్‌ రూ. 25 కోట్లకు పైగానే ఉన్నట్లు వన్‌క్రికెట్‌ అంచనా వేసింది.

చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడి
బాల్య స్నేహితురాలు కాథెరినా మిగ్యూల్‌ను ప్రేమించిన నికోలస్‌ పూరన్‌ 2021 జూన్‌లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అలియారా అనే కూతురు ఉంది. కుటుంబాన్ని ప్రేమించే పూరన్‌ భార్యాబిడ్డలతో ఉన్న ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తాడు.

ఖరీదైన కార్లు
నికోలస్‌ పూరన్‌ వద్ద సుమారు రూ. 2.26 కోట్ల విలువైన BMW i8, 28 లక్షల ధర గల Hyundai Tucson కార్లు ఉన్నట్లు సమాచారం. 

ఫేవరెట్లు వీరే
27 ఏళ్ల నికోలస్‌ పూరన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, సౌతాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిల్లియర్స్‌ రోల్‌మోడల్స్‌. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్లను పూరన్‌ ఆదర్శంగా భావిస్తాడు. కాగా ఎంఎల్‌సీలో విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడిన పూరన్‌ టీమిండియాపై ఎలా ఆడతాడో చూడాలి! ఈ లెఫ్టాండర్‌ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ ఆడతాడా లేదంటే భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేస్తాడా అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చదవండి: కోహ్లితో పాటు ప్రపంచకప్‌ గెలిచి.. ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌ నుంచి ఇప్పుడిలా!
విండీస్‌తో టెస్టుల్లో విఫలం! ఖరీదైన కారు కొన్న టీమిండియా క్రికెటర్‌.. ధర ఎంతంటే! 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు