Breaking News

ఎన్నాళ్లో వేచిన ఉదయం! ఈసారి మా ఆశలు వమ్ము చేయొద్దు ప్లీజ్‌!

Published on Fri, 06/23/2023 - 17:46

Sanju Samson Comeback In Team India: కేరళ క్రికెటర్‌ సంజూ శాంసన్‌కు తిరిగి భారత జట్టులో చోటు దక్కడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు తమకు సంతోషంగా ఉందని, ఈసారి సంజూ కెరీర్‌ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న సంజూ శాంసన్‌ 2015లో జింబాబ్వేతో మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

అయితే, భారత జట్టు సమీకరణలు, ఇతరత్రా కారణాల వల్ల చాలా సందర్భాల్లో సంజూకు నిరాశే ఎదురైంది. ఇందుకు తోడు నిలకడలేమి ప్రదర్శన అతడి అవకాశాలకు గండికొట్టింది. అదే సమయంలో ఇతర యువ ఆటగాళ్లు రేసులోకి దూసుకురావడంతో సంజూ శాంసన్‌ అవకాశాల కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి.

గాయం బారిన పడి
ఈ క్రమంలో టీ20 అరంగేట్రం తర్వాత దాదాపు ఆరేళ్లకు అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఇక చివరిసారిగా.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో జాతీయ జట్టుకు ఎంపికైన సంజూ తొలి మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక రెండో మ్యాచ్‌ సమయానికి గాయం బారిన పడటంతో జట్టులో చోటు కోల్పోయాడు.

తొలిసారి సెంట్రల్‌ కాంట్రాక్ట్‌
ఇక ఆ తర్వాత ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌ నాయకుడిగా జట్టును ముందుకు నడిపిన సంజూ.. 14 మ్యాచ్‌లలో 362 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో తొలిసారి సంజూకు చోటు దక్కింది.

గ్రేడ్‌ ‘సీ’ ఆటగాళ్ల జాబితాలో అతడిని చేర్చింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో ఏడాదికి కోటి రూపాయల వార్షిక వేతనం అందుకోనున్న సంజూ శాంసన్‌.. సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి జట్టుకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. 

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈసారి మాత్రం
దీంతో సంజూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈసారి మాత్రం తగ్గేదేలేదు! మా ఆశలను వమ్ము చేయొద్దు సంజూ! ప్లీజ్‌ ఈసారి బాగా ఆడాలి’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక విండీస్‌తో వన్డే సిరీస్‌ తుది జట్టులో సంజూ పేరు ఉంటుందో లేదో చూడాలి!!

ఇక సంజూ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 11 వన్డేల్లో 330 పరుగులు, 17 టీ20 మ్యాచ్‌లలో 301 పరుగులు సాధించాడు.కాగా జూలై 12 నుంచి టీమిండియా వెస్టిండీస్‌ పర్యటన మొదలుకానుంది.

వెస్టిండీస్‌తో వన్డేలకు టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేష్ కుమార్.

చదవండి: అప్పుడు జట్టులో చోటే కరువు.. ఇప్పుడు వైస్‌ కెప్టెన్‌గా.. నువ్వు సూపర్‌ ‘హీరో’!
నక్క తోక తొక్కిన భారత ఆటగాడు! మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)