Breaking News

యాదృచ్ఛికమో లేక విచిత్రమో.. ఈ ఇద్దరు టీమిండియా మాజీ పేసర్లు..!

Published on Mon, 07/24/2023 - 15:19

జెంటిల్మెన్‌ గేమ్‌ క్రికెట్‌లో ఒకరితో ఒకరికి సరిపోలిన గణాంకాలు ఉండటం సర్వ సాధారణం. ఉదాహరణకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సాధించిన కొన్ని రికార్డులను ప్రస్తుత టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అచ్చం అదే తరహాలో సాధించడం​ మనం చూశాం. ఇలాంటి సరిపోలిన ఘటనలు క్రికెట్‌లో కోకొల్లలు.

అయితే ఇప్పుడు మనం చూడబోయే సరిపోలిన గణాంకాలను మాత్రం క్రికెట్‌ అభిమానులు కనివినీ ఎరిగి ఉండరు. ఇద్దరు భారత బౌలర్లకు సంబంధించి ఒకేలా ఉన్న ఈ గణాంకాలు చూసి జనాలు నివ్వెరపోతున్నారు. కెరీర్‌లు మిగిసే నాటికి సేమ్‌ టు సేమ్‌ ఉన్న గణాంకాలు చూసి అభిమానులు అవాక్కవుతున్నారు.

పేస్‌ బౌలర్లైన జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ.. తమతమ కెరీర్లలో ఒకేలా 311 టెస్ట్‌ వికెట్లు పడగొట్టారు. ఇద్దరు బౌలర్ల విషయంలో ఇలా జరగడం చాలా కామన్‌. అయితే ఇద్దరూ 11 సార్లు 5 వికెట్ల ఘనత, ఓసారి 10 వికెట్ల ఘనత సాధించి.. స్వదేశంలో 104 వికెట్లు, ఇతర దేశాల్లో 207 వికెట్లు పడగొట్టి ఉండటం మాత్రం విచిత్రమే. 

విండీస్‌తో రెండో టెస్ట్‌ సందర్భంగా జహీర్‌, ఇషాంత్‌ హిందీ కామెంట్రీ బాక్స్‌లో ఉండగా.. బ్రాడ్‌కాస్టర్‌ ఈ గణాంకాలను తెరపైకి తెచ్చాడు. ఇది చూసి జహీర్‌, ఇషాంత్‌లు సైతం ఆశ్చర్యపోయారు. తమకు కూడా తెలీని ఈ విషయం క్రికెట్‌ ప్రపంచానికి తెలియజేసినందుకు వారు బ్రాడ్‌కాస్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో.. ఇదెక్కడి విచిత్రం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఆఖరి రోజు 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. అదే విండీస్‌ గెలవాలంటే మరో 289 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లు ఉన్న ఊపును చూస్తే ఇది అంత ఆషామాషీ విషయం కాదని తెలుస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్‌ గెలిచిన భారత్‌ 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్‌ కూడా గెలిస్తే 2-0తో సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)