Breaking News

యువ జట్టును సిద్ధం చేస్తున్నామన్న ద్రవిడ్‌! రోహిత్‌ స్పందన ఇదే! నేనింకా..

Published on Tue, 01/10/2023 - 10:10

India vs Sri Lanka, 1st ODI - Rohit Sharma- గువహటి: వచ్చే టి20 వరల్డ్‌కప్‌ కోసం జట్టును సిద్ధం చేస్తున్నామని ఇటీవల కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లి టి20ల భవిష్యత్తుపై సందేహాలు రేగాయి. వారిని పక్కన పెట్టి జట్టును పునర్నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కెప్టెన్‌ రోహిత్‌ స్పందించాడు.

తానేమీ అంతర్జాతీయ టి20ల నుంచి తప్పుకోలేదని, ఐపీఎల్‌ తర్వాతే దీనిపై ఆలోచిస్తానని అతను అన్నాడు. ‘మనం ఈ ఏడాది ఆరు టి20లు ఆడాల్సి ఉంటే మూడు ముగిశాయి. మిగతా మూడులో ఏం చేయాలో తెలుసు. అయితే ఒకటి మాత్రం స్పష్టం. నేను అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పలేదు.

అందరూ అన్ని మ్యాచ్‌లు ఆడలేరు
ఐపీఎల్‌ తర్వాతే దీనిపై ఆలోచిస్తా. అయితే ఈ ఏడాది మా అందరి దృష్టీ వన్డేలపైనే ఉంది. అందరూ అన్ని మ్యాచ్‌లు ఆడలేరు. సీనియర్లకు పని భారం తగ్గించడంలో భాగంగానే లంకతో సిరీస్‌లో కొత్త ఆటగాళ్లు ఆడారు. నేను కూడా విశ్రాంతి తీసుకున్నవారిలో ఉన్నాను’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా- శ్రీలంక మధ్య గువహటి వేదికగా మంగళవారం తొలి వన్డే ఆరంభం కానుంది. 

రికార్డుల వీరుడు!
ఈ నేపథ్యంలో​ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. లంకతో టీ20 సిరీస్‌కు తను అందుబాటులో లేకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మకు ఘనమైన రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హిట్‌మ్యాన్‌ ఏకంగా జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అంతేకాదు లీగ్‌, అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించాడు.

చదవండి: Ind Vs SL: సూర్య, ఉమ్రాన్‌కు నో ఛాన్స్‌!.. ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే.. ఫలితం?
AUS Vs IND: టీమిండియాతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)