శ్రీలంకతో మూడో వన్డే.. మళ్లీ టాస్‌ ఓడిన టీమిండియా..కేఎల్‌ రాహుల్‌పై వేటు

Published on Wed, 08/07/2024 - 14:22

కొలొంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఆగస్ట్‌ 7) జరుగనున్న మూడో వన్డేలో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేయనుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా టాస్‌ ఓడటం ఇది వరుసగా మూడోసారి. ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కేఎల్‌ రాహుల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానాల్లో రిషబ్‌ పంత్‌, రియాన్‌ పరాగ్‌ తుది జట్టులోకి వచ్చారు. 

మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్‌ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.

తుది జట్లు..

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్‌), జనిత్ లియనాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)