Breaking News

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన శాంసన్‌

Published on Mon, 07/29/2024 - 09:09

టీమిండియాలో మోస్ట్‌ అన్‌ లక్కీ క్రికెటర్‌గా సంజూ శాంసన్‌కు పేరుంది. ఈ విషయాన్ని అతను మరోసారి నిరూపించాడు. శుభ్‌మన్‌ గిల్‌కు మెడ పట్టేయడంతో శ్రీలంకతో రెండో టీ20లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సంజూ.. ఈ మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే క్లీన్‌ బౌల్డై అందరినీ నిరాశపరిచాడు. సంజూ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక​పోవడంతో నెటిజన్లు అతన్ని ఘోరంగా ఆడుకుంటున్నారు. 

అవకాశాలు రాకపోతే ఇవ్వలేదంటారు.. వస్తే ఇలా చేస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సంజూ గోల్డెన్‌ డకౌటైన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఈ మ్యాచ్‌లో సంజూ మహీశ్‌ తీక్షణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే..  వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్‌ పెరీరా (53) అర్ద సెంచరీతో రాణించగా.. పథుమ్‌ నిస్సంక (32), కమిందు మెండిస్‌ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

శ్రీలంక చివరి ఏడు వికెట్లు 31 పరుగుల వ్యవధిలో కోల్పోయి భారీ స్కోర్‌ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. రవి బిష్ణోయ్‌ (4-0-26-3), అర్ష్‌దీప్‌ సింగ్‌ (3-0-24-2), అక్షర్‌ పటేల్‌ (4-0-30-2), హార్దిక్‌ పాండ్యా (2-0-23-2) లంకేయులను భారీగా దెబ్బేశారు.

అనంతరం భారత్‌ ఛేదనకు దిగే సమయానికి వర్షం మొదలైంది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. ఛేదనలో భారత్‌ ఆదిలోనే సంజూ శాంసన్‌ వికెట్‌ కోల్పోయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్‌ చేసింది. యశస్వి జైస్వాల్‌ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపించారు. 

ఆఖర్లో హార్దిక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలు, సిక్సర్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. బంతితో రాణించిన హార్దిక్‌ బ్యాట్‌తోనూ చెలరేగాడు. ఫలితంగా భారత్‌ 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది (3 వికెట్ల నష్టానికి). ఈ గెలుపుతో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 రేపు (జులై 30) జరుగనుంది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)