దంచికొట్టిన కోహ్లి, రోహిత్‌, రాహుల్‌.. సౌతాఫ్రికాకు భారీ లక్ష్యం

Published on Sun, 11/30/2025 - 17:38

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్‌ భారీ స్కోరు సాధించింది. రాంచి వేదికగా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తద్వారా సౌతాఫ్రికాతో వన్డేల్లో రెండో అత్యధిక స్కోరును భారత్‌ నమోదు చేసింది.

రోహిత్‌ మెరుపు అర్ధ శతకం
స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచి వేదికగా సౌతాఫ్రికాతో తొలి వన్డే (IND vs SA 1st ODI)లో టాస్‌ ఓడిన టీమిండియా.. తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (18) నిరాశపరచగా.. రోహిత్‌ శర్మ (Rohit Sharma) ధనాధన్‌ దంచికొట్టాడు. మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) సాధించాడు.

మరోవైపు.. రోహిత్‌తో కలిసి వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హిట్‌మ్యాన్‌తో కలిసి రెండో వికెట్‌కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 

కోహ్లి రికార్డు సెంచరీ
ఈ క్రమంలో 102 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. ఆ తర్వాత జోరు పెంచాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 60)తో కలిసి ఐదో వికెట్‌కు 76 పరుగులు జోడించిన కోహ్లి.. నండ్రీ బర్గర్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో మొత్తంగా 120 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 11 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌గా 83వ శతకం, వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేశాడు. 

రాణించిన జడేజా
మిగిలిన వారిలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) వేగంగా ఆడగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (8), వాషింగ్టన్‌ సుందర్‌ (13) విఫలమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్‌ 349 పరుగులు సాధించి.. సౌతాఫ్రికాకు 350 పరుగుల టార్గెట్‌ విధించింది.

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌, నండ్రీ బర్గర్‌, కార్బిన్‌ బాష్‌, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా వన్డేల్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు (349/8). 

ఇంతకు ముందు 2010లో గ్వాలియర్‌ వేదికగా టీమిండియా ప్రొటిస్‌ జట్టుపై మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు (401/3) చేసింది. ఇదిలా ఉంటే.. శుబ్‌మన్‌ గిల్‌ మెడ నొప్పి వల్ల వన్డే సిరీస్‌కు దూరం కాగా.. కేఎల్‌ రాహుల్‌ టీమిండియాను ముందుకు నడిపిస్తున్నాడు.

చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. 7000వ సెంచరీ గురించి తెలుసా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)