Breaking News

ఒక రోజు ముందే ఇండియా-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్..?

Published on Wed, 07/26/2023 - 10:24

భారత్‌ వేదికగా ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్‌కప్‌ జరుగనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం ఈ మెగా టోర్నీలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 15న జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు దేవీ నవరాత్రులకు మొదటి రోజు కావటం, అందులోనూ ఈ పండుగను ఘనంగా జరుపుకునే అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ జరుగుతుండటంతో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే దయాదుల సమరాన్ని రీషెడ్యూల్‌ చేసుకోవాలని సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐకి సూచించినట్లు తెలుస్తుంది.

దీనిపై బీసీసీఐ కూడా స్పందించినట్లు సమాచారం. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ తేదీ మార్పు అంశం పరిశీలనలో ఉన్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

భారత్‌-పాక్‌ లాంటి హైప్రొఫైల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌కు చేరుకుంటారని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌ జరిగితే దేవీ నవరాత్రుల పండుగ కారణంగా విధించే అంక్షల కారణంగా ఫ్యాన్స్‌ ఇబ్బందులకు గురవుతారని సెక్యూరిటీ ఏజెన్సీలు తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

దాయాదుల సమరాన్ని షెడ్యూల్‌ తేదీకి ఒక రోజు ముందు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఏదిఏమైనా షెడ్యూల్‌ ప్రకారం భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగకపోతే మాత్రం ముందుగా టికెట్లు కొనుగోలు చేసిన వారు, ముందస్తుగా అహ్మదాబాద్‌లో వసతి ఏర్పాట్లు చేసుకున్న వారు చాలా ఇబ్బందులకు గురవుతారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)