Breaking News

Asia cup 2025 Final: పాక్‌కు కౌంటరిచ్చిన బుమ్రా

Published on Sun, 09/28/2025 - 22:27

భారత్‌, పాకిస్తాన్‌ (India vs pakistan) మధ్య జరుగుతున్న ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) హైడ్రామా చోటు చేసుకుంది. సూపర్‌-4 మ్యాచ్‌లో పాక్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ (Haris Rauf) చేసిన ఓవరాక్షన్‌కు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) కౌంటరిచ్చాడు.

ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో అద్భుతమైన యార్కర్‌తో హరిస్ రౌఫ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. విమానం కూలిపోయినట్లు సంజ్ఞ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. రౌఫ్‌కు సరైన సమాధానం చెప్పావంటూ భారత అభిమానులు బుమ్రాను ప్రశంసిస్తున్నారు.

సూపర్‌-4 మ్యాచ్‌లో రౌఫ్‌ ఫీల్డింగ్‌ చేసే సమయంలో విమానం క్రాష్‌ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. రౌఫ్‌ చర్యలపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేయగా.. అతనికి 30 శాతం మ్యాచ్‌ ఫీజ్‌ను జరిమానాగా విధించారు.

అదే మ్యాచ్‌లో మరో పాక్‌ ఆటగాడు కూడా అభ్యంతరకంగా ప్రవర్తించాడు. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్‌ను గన్‌లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇతనిపై కూడా బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫర్హాన్‌ను ఐసీసీ మందలింపుతో వదిలిపెట్టింది.

కాగా, నేటి ఫైనల్లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (57), ఫకర్‌ జమాన్‌ (46) రాణించడంతో పాక్‌ తొలుత భారీ స్కోర్‌ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం​ వికెట్‌ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్‌లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.

33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ (4-0-26-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లతో పాటు వన్‌ డౌన్‌ బ్యాటర్‌ సైమ్‌ అయూబ్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

చదవండి: Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)