శుభ్‌మన్‌ గిల్‌ సుడిగాలి శతకం.. టీమిండియా భారీ స్కోర్‌

Published on Wed, 02/01/2023 - 20:50

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా యంగ్‌ డైనమైట్‌ శుభ్‌మన్‌ గిల్‌ (63 బంతుల్లో 126 నాటౌట్‌; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్‌ ఈ మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో పొట్టి ఫార్మాట్‌లో తన తొట్టతొలి సెంచరీ నమోదు చేశాడు.

గిల్‌ 187.04 స్ట్రయిక్‌ రేట్‌తో శతక్కొట్టాడంటే, అతని విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో ఇట్టే అర్ధమవుతోంది. సెంచరీ చేశాక కూడా ఏమాత్రం తగ్గని గిల్‌.. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సెంచరీ సాధించిన అనంతరం గిల్‌ ప్రేక్షకుల వైపు తలవంచి అభివాదం చేశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో డబుల్‌ సెంచరీతో పాటు మరో సెంచరీ కూడా బాదిన గిల్‌.. టీ20ల్లోనూ శతకాల పరంపరను కొనసాగించాడు.

గిల్‌ విధ్వంసకర శతకానికి రాహుల్‌ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 24; ఫోర్‌, 2 సిక్సర్లు), హార్ధిక్‌ పాం‍డ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు కూడా తోడవ్వడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ (1) ఒక్కడే నిరుత్సాహపరిచాడు. కివీస్‌ బౌలర్లలో బ్రేస్‌వెల్‌, టిక్నర్‌, సోధీ, డారిల్‌ మిచెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 


 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)