Breaking News

రెండో వన్డేలో కివీస్‌పై భారత్‌ విజయం

Published on Sat, 11/07/2026 - 07:49

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 4 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. పదేపదే వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం టీమిండియాను విజేతగా నిర్ణయించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి భారత్‌ దూసుకెళ్లింది.

UPDATES
టీమిండియా రివైజ్డ్‌ టార్గెట్‌: 37 ఓవర్లలో 133 పరుగులు చేయాలి. అయితే, మరోసారి జల్లులు కురుస్తుండటం గమనార్హం

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. వరుణుడి ఆటంకం
25.3వ ఓవర్‌- జేమీసన్‌ బౌలింగ్‌లో డఫీకి క్యాచ్‌ ఇచ్చి అన్షుల్‌ కంబోజ్‌ ఔటయ్యాడు. భారత్‌ విజయానికి ఇంకా 22 పరుగులు కావాలి. కేఎల్‌ రాహుల్‌ (26), నబీ (1) క్రీజ్‌లో ఉన్నారు. 26 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 113-7గా ఉంది. వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోయింది. 

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
24.4వ ఓవర్‌- 108 పరుగుల వద్ద భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. డఫీ బౌలింగ్‌లో నమన్‌ ధిర్‌ (12) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మరో 25 పరుగులు చేయాలి. 

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
19.6వ ఓవర్‌- 86 పరుగుల వద్ద భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. జేమీసన్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (30) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మరో 49 పరుగులు చేయాలి.  

అక్షర్‌ పటేల్‌ ఔట్‌
అక్షర్‌ పటేల్‌(7) రూపంలో భారత్‌ 47 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. శ్రేయస్‌ అయ్యర్‌ (9) క్రీజులో ఉన్నాడు. భారత్‌ విజయానికి 88 పరుగులు అవసరం.

కష్టాల్లో భారత్‌.. మూడో వికెట్‌ డౌన్‌
8.4వ ఓవర్‌- స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌ కూడా తడబడుతోంది. 39 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. తాజాగా రోహిత్‌ శర్మ 23 పరుగులు చేసి జేమీసన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

కోహ్లి ఔట్‌
3.4వ ఓవర్‌- 17 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. డఫీ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి (7) ఔటయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌.. గిల్‌ ఔట్‌
1.1వ ఓవర్‌- స్వల్ప లక్ష్యఛేదనలో భారత్‌ 4 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. జేకబ్‌ డఫీ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ డకౌటయ్యాడు.

134 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ భారత బౌలర్ల ధాటికి 41 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. గుర్నూర్‌ బ్రార్‌ 4,అక్షర్‌ పటేల్‌, అన్షుల్‌ కంబోజ్‌, ఆకిబ్‌ నబీ తలో 2 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను మట్టికరిపించారు. న్యూజిలాండ్‌ తరఫున డారిల్‌ మిచెల్‌ (55) మాత్రం అర్ద సెంచరీతో రాణించాడు. 

తొమ్మి‍దో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
39.5వ ఓవర్‌- 132 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. బ్రార్‌ బౌలింగ్లో నాథన్‌ స్మిత్‌ (3) ఔటయ్యాడు. 

ఎనిమిదో వికెట్‌ డౌన్‌
38.2వ ఓవర్‌- 127 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ పడింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో జేమీసన్‌ (7) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

ఏడో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
35.5వ ఓవర్‌- 119 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. బ్రార్‌ బౌలింగ్‌లో సాంట్నర్‌ (31) ఔటయ్యాడు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
34.6వ ఓవర్‌- 112 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌ (55) ఔటయ్యాడు.

31 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 99-5
31 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 99-5గా ఉంది. డారిల్‌ మిచెల్‌ 44, మిచెల్‌ సాంట్నర్‌ 23 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

25 ఓవర్లలో న్యూజిలాండ్‌ స్కోరు: 73-5
డారిల్‌ మిచెల్‌ 33, సాంట్నర్‌ 10 పరుగులతో ఉన్నారు.

53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ పీకల్లోతు కష్టాల్లో ఉంది. 53 పరుగులకే ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. గుర్నూర్‌ బ్రార్‌ ఒకే ఓవర్‌లో (20) రెండు వికెట్లు (లాథమ్‌ (7), ఫిలిప్స్‌ (0)) తీసి న్యూజిలాండ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. 20 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 53-5గా ఉంది. డారిల్‌ మిచెల్‌ (24), మిచెల్‌ సాంట్నర్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
8.4వ ఓవర్‌- అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో నికోల్స్‌ (11) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
5.4వ ఓవర్‌- 11 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఆకిబ్‌ నబీ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి విల్‌ యంగ్‌ (6) ఔటయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
1.5వ ఓవర్‌- పరుగుల ఖాతా తెరవకుండానే న్యూజిలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆకిబ్‌ నబీ బౌలింగ్‌లో టిమ్‌ సీఫర్ట్‌ డకౌటయ్యాడు. 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌.. 47 ఓవర్ల మ్యాచ్
భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నారు. తడి ఔట్‌ ఫీల్డ్‌ కారణంగా ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. 

తుది జట్లు..
న్యూజిలాండ్: విల్ యంగ్, టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(c), నాథన్ స్మిత్, కైల్ జామీసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(సి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

7:47 AM- భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య వెల్లింగ్టన్‌ వేదికగా ఇవాళ జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్‌ ఆలస్యమవుతుంది. తడి ఔట్‌ ఫీల్డ్‌ కారణంగా ఇంకా టాస్‌ కూడా పడలేదు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌ ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టాస్‌ 8 గంటలకు పడుతుంది. మ్యాచ్‌ 8:30 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  ఓవర్ల కోత ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆక్లాండ్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ఇదీ చదవండి: టెస్ట్ క్రికెట్‌కు మహ్మద్ షమీ గుడ్ బై

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)