Breaking News

Ind vs NZ 2024: షెడ్యూల్‌, జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు

Published on Tue, 10/15/2024 - 11:25

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌ చేరడమే లక్ష్యంగా టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన రోహిత్‌ సేన.. తదుపరి న్యూజిలాండ్‌తో పోరులోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది.

ఇక స్వదేశంలో ఈ టెస్టు సిరీస్‌ జరుగనుండటం టీమిండియాకు సానుకూలాంశం. మరోవైపు.. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో 0-2తో వైట్‌వాష్‌ అయిన కివీస్‌ జట్టు.. భారత్‌లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్‌ సేన ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కివీస్‌ ఆరో స్థానంలో ఉంది.

మరి ఇరుజట్లకు కీలకమైన ఈ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌, వేదికలు, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్, ఇరు జట్లు తదితర వివరాల గురించి తెలుసుకుందామా?!

టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ 2024 టెస్టు సిరీస్‌
👉తొలి టెస్టు: అక్టోబరు 16(బుధవారం)-  అక్టోబరు 20(ఆదివారం), ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
👉రెండో టెస్టు: అక్టోబరు 24(గురువారం)-  అక్టోబరు 28(సోమవారం), మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, పుణె
👉మూడో టెస్టు: నవంబరు 1(శుక్రవారం)- నవంబరు 5(మంగళవారం), వాంఖడే స్టేడియం, ముంబై.

మ్యాచ్‌ సమయం: భారత కాలమానం ప్రకారం.. మూడు టెస్టులు ఉదయం 9.30 - సాయంత్రం 5 గంటల వరకు.

ఎక్కడ చూడవచ్చు?
👉టీవీ: స్పోర్ట్స్‌ 18లో లైవ్‌ టెలికాస్ట్‌
👉డిజిటల్‌ మీడియా: జియో సినిమా, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం.

న్యూజిలాండ్‌తో టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్‌ టీమ్‌
డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్‌మన్‌, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్‌, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.

చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి...

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)