Breaking News

IND vs NZ: కివీస్‌ 402 ఆలౌట్‌.. భారీ ఆధిక్యం

Published on Fri, 10/18/2024 - 13:17

టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరు వేదికగా 180/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టింది కివీస్‌.

రచిన్‌ రవీంద్ర సెంచరీ
మిడిలార్డర్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. టెయిలెండర్‌ టిమ్‌ సౌతీ అతడికి సహకారం అందించాడు. రచిన్‌ 157 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో ఇది రెండో టెస్టు సెంచరీ. మరోవైపు.. సౌతీ 73 బంతుల్లో 65 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లలో మూడో రోజు గ్లెన్‌ ఫిలిప్స్‌(14) ఒ​‍క్కడే డబుల్‌ డిజిట్‌ స్కోరు సాధించాడు.

ఇక గురువారం ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 91 పరుగులతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌ ఒక వికెట్‌ తీశాడు. 

పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రోహిత్‌ సేన 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఫలితంగా న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం లభించింది.

టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌
👉తొలి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20
👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు
👉రెండో రోజు పడిన టాస్‌

👉టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా
👉టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 46 పరుగులకే ఆలౌట్‌
👉న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 402 ఆలౌట్‌.

చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్‌

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)