Breaking News

IND vs NZ 1st Test: బెంగళూరులో భారీ వర్షం.. అభిమానులకు చేదువార్త

Published on Wed, 10/16/2024 - 09:01

Ind vs NZ 1st Test Day 1: Toss delayed due to rain: టీమిండియా- న్యూజిలాండ్‌ తొలి టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. బెంగళూరులో భారీగా వాన పడుతుండటంతో టాస్‌ ఆలస్యం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్‌ జట్టు భారత్‌కు వచ్చింది.

షెడ్యూల్‌ ప్రకారం... ఇరుజట్ల మధ్య బుధవారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉంది. అయితే, భారత్‌- కివీస్‌ తొలి టెస్టుకు వేదికైన చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే మైదానాన్ని కవర్స్‌తో కప్పినా.. సమయానికి మ్యాచ్‌ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.

ఫైనల్‌ దారిలో టీమిండియా
డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఫైనల్‌ చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్‌ కీలకం. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్‌ సేన కివీస్‌తో మూడు టెస్టుల్లో గెలిస్తే నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల రూపంలో కఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

మరోవైపు.. పట్టికలో ఆరోస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ ఇటీవలే శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. అయితే, భారత్‌లో సత్తా చాటి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.

టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ 2024 జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

న్యూజిలాండ్‌
డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్‌మన్‌, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్‌, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, జాకోబ్‌ డఫీ, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)