Breaking News

టీమిండియాకు భారీ షాక్‌

Published on Thu, 01/22/2026 - 05:02

టీ20 ప్రపంచకప్ టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే వాషింగ్టన్ సందర్, తిలక్ వర్మ గాయాల బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేరాడు. నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టీ20లో అక్ష‌ర్ గాయ‌ప‌డ్డాడు.

కివీస్ ఇన్నింగ్స్ 16 ఓవ‌ర్ వేసిన అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో మూడో బంతిని డారిల్ మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే బంతిని ఆపే క్ర‌మంలో అక్ష‌ర్ చేతి వేలికి గాయ‌మైంది. బంతి బ‌లంగా త‌గ‌ల‌డంతో అక్షర్ ఎడమ చేతి చూపుడు వేలు చిట్లి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అత‌డు తీవ్ర‌మైన నొప్పి కార‌ణంగా ఓవ‌ర్ మ‌ధ్య‌లోనే మైదానాన్ని వీడాడు.

మిగిలిన ఓవ‌ర్‌ను అభిషేక్ శ‌ర్మ పూర్తి చేశాడు. అత‌డి గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. అయితే అక్ష‌ర్ గాయం తీవ్ర‌మైన‌ది కాన‌ట్లుగా తెలుస్తోంది. వేలు పైన మాత్ర‌మే చిట్లడం వ‌ల్ల ర‌క్త స్ర‌వ‌మైంద‌ని ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కానీ శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న రెండో టీ20కు మాత్రం అక్షర్ దూరమయ్యే అవకాశముంది.

ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అభిషేక్ శర్మ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్‌(44) రాణించాడు. అనంతరం కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: అటు గిల్‌... ఇటు జడేజా

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)