Breaking News

అభిషేక్‌ విధ్వంసం, రింకూ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్‌

Published on Wed, 01/21/2026 - 20:52

నాగ్‌పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోర్‌ (238/7) చేసింది. టాస్‌ ఓడి న్యూజిలాండ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. తొలి బంతి నుంచి ఎదురుదాడి ప్రారంభించింది. 

ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.

అభిషేక్‌కు జతగా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్‌) కాసేపు మెరుపులు మెరిపించాడు. అతని తర్వాత హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌) కూడా సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్‌ విశ్వరూపం ప్రదర్శించాడు.  కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్‌ భారీ స్కోర్‌ చేసింది.

మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్‌ 10, ఇషాన్‌ కిషన్‌ 8, శివమ్‌ దూబే 9, అక్షర్‌ పటేల్‌ 5, అర్షదీప్‌ (6 నాటౌట్‌) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో డఫీ, జేమీసన్‌ చెరో 2.. క్రిస్టియన్‌ క్లార్క్‌, సోధి, సాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)