చెత్త ఫీల్డింగ్‌! క్యాచ్‌ అంటే ఇలా పట్టాలి.. రోహిత్‌ శర్మ రియాక్షన్‌‌! వీడియో

Published on Mon, 09/04/2023 - 17:59

Asia Cup, 2023 India vs Nepal: నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కీలక సమయంలో నేపాల్‌ బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత రోహిత్‌ ఇచ్చిన రియాక్షన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆసియా కప్‌-2023లో రెండో మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు.. పల్లెకెలె వేదికగా సోమవారం నేపాల్‌తో తలపడుతోంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, ఆరంభంలో శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లి, ఇషాన్‌ కిషన్‌ సులభమైన క్యాచ్‌లను వదిలేశారు.

చెత్త ఫీల్డింగ్‌ వల్లే.. వాళ్లు రెచ్చిపోయారు
దీంతో లైఫ్‌ పొందిన నేపాల్‌ ఓపెనర్లు కుశాల్‌ భుర్తాల్‌(38), ఆసిఫ్‌ షేక్‌(58) మంచి స్కోర్లు సాధించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదం వారి పాలిట వరంగా మారిందనడంలో సందేహం లేదు. 

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఈ ఇద్దరు బ్యాటర్లు ఈ మేరకు స్కోర్‌ చేశారంటే అది మన చెత్త ఫీల్డింగ్‌ వల్లేనని అభిమానులు ఫైర్‌ అయ్యారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ అందుకున్న క్యాచ్‌ హైలైట్‌గా నిలిచింది. 

ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. క్యాచ్‌ పట్టేసిన రోహిత్‌ శర్మ
నేపాల్‌ ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ రోహిత్‌ పౌడేల్‌ బంతిని తప్పుగా అంచనా వేశాడు. బ్యాక్‌ఫుట్‌ షాట్‌ ఆడబోయి ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ సింపుల్‌ క్యాచ్‌ను ఒడిసిపట్టేసిన టీమిండియా సారథి సంబరాల్లో మునిగిపోయాడు.

రోహిత్‌ పట్టిన క్యాచ్‌.. వీడియో వైరల్‌
అంతేకాదు.. క్యాచ్‌ అంటే ఇలా పట్టాలి అన్నట్లుగా సహచర ఆటగాళ్ల వైపు ఓ లుక్కేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేసింది. ఇక రోహిత్‌ శర్మ క్యాచ్‌ను నమ్మలేని... నేపాల్‌ కెప్టెన్‌ రోహిత్‌(5) బిక్కమొఖం వేసి నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

వరుణుడి ఆటంకం
కాగా 37.5 ఓవర్ల వద్ద వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి నేపాల్‌ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు, సిరాజ్‌కు రెండు, శార్దూల్‌ ఠాకూర్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ఇదిలా ఉంటే.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడ్డ టీమిండియాకు వరుణుడు ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ తర్వాత ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు కావడంతో చెరో పాయింట్‌ లభించింది.

చదవండి: ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్‌? బుద్ధుందా? 
WC 2023: తిలక్‌ వర్మను ఎందుకు ఎంపిక చేసినట్లు? అతడు అవసరమా?

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)