Breaking News

Ind vs Eng 1st Test: బుమ్రాకు షాకిచ్చిన ఐసీసీ

Published on Mon, 01/29/2024 - 16:37

India vs England, 1st Test: టీమిండియా ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి షాకిచ్చింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంగా ఐసీసీ అతడిని మందలించింది. అదే విధంగా..  బుమ్రా ఖాతాలో డిమెరిట్‌ పాయింట్‌ జతచేసింది.

హైదరాబాద్‌ టెస్టులో ఆరు వికెట్లు
ఇంతకీ ఏం జరిగిందంటే...  ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా- ఇంగ్లండ్‌ హైదరాబాద్‌ వేదికగా తొలి టెస్టులో తలపడిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత పేస్‌ గుర్రం బుమ్రా మొత్తం ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు.

బుమ్రా మ్యాజిక్‌.. పోప్‌ డబుల్‌ సెంచరీ మిస్‌
ముఖ్యంగా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కొరకరాని కొయ్యగా మారిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒలీ పోప్‌ను 196 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద(102.1వ ఓవర్‌) అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు. అయితే, అంతకంటే ముందు అంటే.. 81వ ఓవర్లో పోప్‌ వికెట్ల మధ్య పరుగు తీస్తున్నపుడు బుమ్రా కావాలనే అతడికి అడ్డంగా వెళ్లినట్లు కనిపించింది. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం ఢీకొన్నారు.

పొరపాటును అంగీకరించడంతో..
ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.12 నిబంధన ప్రకారం.. రూల్స్‌ను అతిక్రమించాడంటూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి బుమ్రాను మందలించింది. ఫీల్డ్‌ అంపైర్లు, సంబంధిత అధికారులు బుమ్రాదే తప్పని తేల్చగా.. బుమ్రా తన పొరపాటును అంగీకరించాడు. దీంతో ఐసీసీ అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ను చేర్చింది.  

ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లండ్‌ ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒలీ పోప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.

చదవండి: టీమిండియాకు బిగ్‌ షాక్‌: రాహుల్‌, జడేజా దూరం.. వాళ్లకు ఛాన్స్‌: బీసీసీఐ ప్రకటన

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)