Breaking News

అందుకే రోహిత్‌ అవుట్‌!.. కెప్టెన్‌గా బుమ్రా.. బీసీసీఐ చెప్పిందిదే

Published on Sat, 03/09/2024 - 14:41

IND vs ENG, 5th Test, Day 3- Rohit Sharma: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. బజ్‌బాల్‌ అంటూ  దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్‌ బృందాన్ని ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించేసి సిరీస్‌ను 4-1తో గెలిచింది.

ఇదిలా ఉంటే.. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌ మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మైదానంలో దిగలేదు. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌, పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా సారథిగా వ్యవహరించాడు.

ఇందుకు గల కారణాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి వెల్లడించింది. రోహిత్‌ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో మైదానంలో దిగలేదని తెలిపింది. కాగా నొప్పి తీవ్రతరమైతే హిట్‌మ్యాన్‌ కొన్ని రోజులపాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

కాగా ధర్మశాల టెస్టులో రోహిత్‌ శర్మ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. 162 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అతడు 103 పరుగులు సాధించాడు. ఇక విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ వంటి ప్రధాన ఆటగాళ్లు లేకుండానే.. యువ జట్టుతో రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 4-1తో గెలవడం విశేషం.

ఇక ఐదో టెస్టులో టీమిండియా గెలిచిన అనంతరం సెలబ్రేషన్స్‌ సమయంలో రోహిత్‌ శర్మ మైదానంలోకి వచ్చాడు. జట్టును అభినందిస్తూ సంతోషం పంచుకున్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)