Breaking News

Ind vs Eng: అతడి ఇన్నింగ్స్‌ అద్భుతం.. సిరీస్‌ గెలిచి తీరతాం!

Published on Mon, 02/19/2024 - 11:18

India vs England, 3rd Test: ఇంగ్లండ్‌ ‘బజ్‌బాల్‌’ను టీమిండియా చితక్కొట్టింది. ఏకంగా 434 పరుగుల తేడాతో స్టోక్స్‌ బృందాన్ని ఓడించి రాజ్‌కోట్‌లో రాజసం చిందించింది. ఫలితంగా కనీవినీ ఎరుగని రీతిలో ఇంగ్లిష్‌ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది.

తద్వారా.. తమ క్రికెట్‌ చరిత్రలోనే పరుగుల పరంగా రెండో అతిపెద్ద పరాజయం మూటగట్టుకుంది స్టోక్స్‌ బృందం. అదే విధంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో వెనుకబడింది. ఈ విషయంపై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ స్పందించాడు.

అతడి ఇన్నింగ్స్‌ అద్భుతం
మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘బెన్‌ డకెట్‌ అద్భుత, అద్వితీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇన్నింగ్స్‌ ఆసాంతం ఇలాంటి జోరే కొనసాగించాలని మేము భావించాం.  టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నాం. భారత రెండో ఇన్నింగ్స్‌లో మేము ఎక్కువ సేపు బౌలింగ్‌ చేయాలని భావించాం. కానీ అలా జరుగలేదు. అనుకున్న దాని కంటే ముందుగానే బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది.

కొన్నిసార్లు ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం సాధ్యం కాదు. ఏదేమైనా మా ఆటగాళ్లకు అండగా నిలవడం ముఖ్యం. ప్రస్తుతం మేము 1-2తో వెనుకబడి ఉన్నాం. అయితే, ఈ మ్యాచ్‌ నుంచి నేర్చుకున్న పాఠాలతో తిరిగి పుంజుకుంటాం.

సిరీస్‌ గెలుస్తాం
ఈ ఓటమి నుంచి తేరుకుని తదుపరి రెండు మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం. కచ్చితంగా సిరీస్‌ గెలిచేందుకు ప్రయత్నిస్తాం’’ అని బెన్‌ స్టోక్స్‌ పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ ధనాధన్‌ సెంచరీ(153)తో అలరించాడు.

అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 4 పరుగులకే రనౌట్‌ అయ్యాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య రాజ్‌కోట్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోగా.. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుంది.

పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు అతిపెద్ద టెస్టు ఓటములు
►562- వర్సెస్ ఆసీస్- ది ఓవల్ 1934
►434- వర్సెస్‌ భారత్- రాజ్ కోట్- 2024
►425- వర్సెస్ వెస్టిండీస్‌- మాంచెస్టర్ 1976
►409- వర్సెస్ ఆసీస్- లార్డ్స్ 1948
►405- వర్సెస్ ఆసీస్- లార్డ్స్ 2015

చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియాలో ఊహించని మార్పు! స్టార్‌ ప్లేయర్‌ దూరం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)