Ind vs Eng: బౌలర్లకు కష్టమే.. బ్యాటర్లపైనే భారం! వారు ‘ఫాస్ట్‌ షో’ మొదలెడితే..

Published on Tue, 01/28/2025 - 08:23

ఇంకా కెప్టెన్‌ సూర్యకుమార్‌(Suryakumar Yadav) ‘360 డిగ్రీ’ బ్యాటింగ్‌ బాకీ ఉంది. సంజూ శాంసన్‌(Sanju Samson) మెరుపు జోరు కనబర్చలేదు. హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) అసలు ఆట మిగిలే ఉంది. అయినాసరే భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఇప్పుడు సిరీస్‌ను కైవసం చేసుకునే పనిలో పడింది. 

ఒకవేళ ఈ ముగ్గురు గనక రాణిస్తే మూడో మ్యాచ్‌తోనే భారత్‌ ఐదు టీ20ల సిరీస్‌ను గెలుచుకునే అవకాశముంది. ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై ‘హ్యాట్రిక్‌’ విజయం, సిరీస్‌ కైవసం ఏమంత కష్టం కాకపోవచ్చు.  

వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఇప్పుడు సిరీస్‌పైనే కన్నేసింది. రాజ్‌కోట్‌లో జరిగే మూడో టీ20లో గెలిచి ఇక్కడే సిరీస్‌ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్టార్‌ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో తమ వైఫల్యాల్ని అధిగమిస్తే ఇంగ్లండ్‌కు మూడో పరాజయం తప్పదేమో! ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమి బట్లర్‌ బృందాన్ని కుంగదీసింది.

ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. అయితే ఇది పొట్టి ఫార్మాట్‌. ఏ క్షణంలోనైనా, ఏ ఓవరైనా ఉన్నపళంగా మార్చేయగలదు. కాబట్టి ఏ జట్టు తప్పక గెలుస్తుందనే గ్యారంటీ లేదు. 

గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్‌ ఓపెనింగ్‌ జోడీ సాల్ట్‌–డకెట్‌ విఫలమైంది. వారి ఓపెనింగ్‌లో గునక ‘పవర్‌ ప్లే’ కనబడితే భారత్‌కు సవాళ్లు తప్పవు. ఈ నేపథ్యంలో గత రెండో టీ20లాగే ఉత్కంఠరేపే సమరం జరిగొచ్చు.

టాపార్డర్‌ రాణిస్తే... 
ఓపెనర్లలో అభిషేక్‌ శర్మ తొలి మ్యాచ్‌లో మెరిపించాడు. కానీ శాంసన్‌ నుంచే ఆ మెరుపులు కరువయ్యాయి. కెప్టెన్‌ సూర్యకుమార్‌ కూడా టీ20కి కాదుకదా... వన్డేకు సరిపడా ఆటకూడా చూపించలేకపోయాడు. ఈ ముగ్గురు మూకుమ్మడిగా రాణిస్తే మిడిలార్డర్‌ సంగతి చూసుకునేందుకు తిలక్‌ వర్మ, హర్దిక్‌ పాండ్యా, ధ్రువ్‌ జురేల్‌ ఉన్నారు.

బ్యాటింగ్‌కు అచ్చొచ్చే పిచ్‌పై లోయర్‌ ఆర్డర్‌లో వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్‌లు కూడా దంచేసే అవకాశాన్ని పిచ్‌ కల్పిస్తుంది. గత మ్యాచ్‌ల్ని నిశితంగా గమనిస్తే... బ్యాటింగ్‌ కన్నా కూడా మన బౌలింగ్‌ దళం గట్టి ప్రభావమే చూపింది. 

ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను తేలిగ్గా కూల్చేస్తుంది. అర్ష్‌దీప్, పాండ్యాలకు జతగా మరో సీమర్‌ను తీసుకోవాలనుకుంటే స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ని పక్కన బెట్టొచ్చు.

భారమంతా బ్యాటర్లపైనే... 
ఇంగ్లండ్‌ కూడా గత మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకుంది. హిట్టింగ్‌ ఓపెనర్లను కూల్చి, మిడిలార్డర్‌ను దెబ్బతీసి మ్యాచ్‌ను గెలిచేస్థితికి వచ్చేసింది. అయితే తిలక్‌ వర్మ పోరాటమే వారి శ్రమను నీరుగార్చింది. లేదంటే చెన్నైలోనే భారత్‌కు 1–1తో చెక్‌ పెట్టేది. కార్స్, మార్క్‌వుడ్, ఆర్చర్, రషీద్‌లతో కూడిన బౌలింగ్‌ దళం పటిష్టంగానే ఉంది.

అయితే పరిస్థితి చక్కబెట్టాల్సింది... ఎదురుదాడికి దిగాల్సింది... బ్యాటర్లే! ఫిల్‌ సాల్ట్, డకెట్‌లు ఆషామాషీ ఓపెనర్లు కాదు. కానీ వారి ఫ్లాప్‌షో ముగిసి ‘ఫాస్ట్‌ షో’ మొదలైతే మాత్రం పరుగుల తుఫాన్‌ ఖాయం. బట్లర్, బ్రూక్, లివింగ్‌స్టోన్, స్మిత్, ఓవర్టన్, కార్స్, ఆర్చర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదో వరుస బ్యాటింగ్‌ దాకా పరుగుల బాదే ఆటగాళ్లే జట్టుకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇంగ్లండ్‌ భారమంతా బ్యాటర్లపైనే ఉంది.

పిచ్, వాతావరణం 
రాజ్‌కోట్‌ పిచ్‌ ఎప్పుడైనా బ్యాటింగ్‌కు స్వర్గధామం. ప్రత్యేకించి టీ20ల్లో పరుగుల వరద, మెరుపుల సరదా ఖాయం. బ్యాటర్‌ ఫ్రెండ్లీ వికెట్‌పై బౌలర్లకు కష్టాలు తప్పవు. గత రెండు మ్యాచ్‌ల్లో నమోదైన మోస్తరు స్కోరును సులువుగా అధిగమిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తుది జట్లు (అంచనా) 
భారత్‌
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, ధ్రువ్‌ జురేల్, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్, అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌/షమీ, వరుణ్‌ చక్రవర్తి.

ఇంగ్లండ్‌ తుదిజట్టు: 
బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్‌), జోస్ బట్లర్ (కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

రాజ్‌కోట్‌ సూర్యకు ప్రత్యేకం
రాజ్‌కోట్‌లో భారత జట్టు ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో (2013లో  ఆస్ట్రేలియాపై; 2019లో బంగ్లాదేశ్‌పై; 2022లో దక్షిణాఫ్రికాపై; 2023లో శ్రీలంకపై) గెలిచిన టీమిండియా ఒక మ్యాచ్‌లో (2017లో న్యూజిలాండ్‌ చేతిలో) ఓడిపోయింది. 

ఈ మైదానంలో చివరిసారి 2023 జనవరి 7న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ (51 బంతుల్లో 112 నాటౌట్‌; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం విశేషం.

చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్‌ వర్మ!: భారత మాజీ క్రికెటర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)