Breaking News

భారత అత్యుత్తమ తుదిజట్టుకు ఆఖరి కసరత్తు.. వారిద్దరికి ఛాన్స్‌!

Published on Tue, 02/11/2025 - 19:59

ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి భారత్ తన తుది జట్టును ప్రకటించడానికి సమయం దగ్గర పడుతోంది. జట్టులోని ఆటగాళ్ల ఫామ్ గురించి అంచనా వేయడానికి  అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌(India vs England)తో బుధవారం జరిగే మూడో వన్డే మ్యాచ్ టీమిండియాకు చివరి అవకాశం. 

భారత్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నందున.. ఈ మూడో వన్డేలో కొంతమంది ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రయత్నించేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే -2025 ఛాంపియన్స్ ట్రోఫీకి  అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయించడానికి  భారత్ కి ఇదే చివరి అవకాశం.

పంత్‌కు అవకాశం
కర్ణాటక వికెట్ కీపర్-బ్యాటర్  కెఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ వికెట్ కీపర్‌గా రాణించాడు. కానీ ఈ మూడో వన్డే లో రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌ కు అవకాశం కల్పించడం తప్పనిసరి గా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ భారత జట్టులో ప్రధాన వికెట్ కీపర్ అని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంతకూ ముందే ప్రకటించినప్పటికీ పంత్ దూకుడుగా ఆడే స్వభావం వల్ల మిడిల్ ఆర్డర్‌లో అతనికి అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదు.

పైగా జట్టులో రెండో వికెట్ కీపర్ గా అతని ఎంపిక తప్పనిసరిగా కనిపిస్తోంది. పంత్‌కి వన్డేల్లో మెరుగైన రికార్డు (27 ఇన్నింగ్స్‌లలో 871 పరుగులు) ఉంది. అంతేగాక తన అసాధారణ షాట్‌లతో మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చగల సత్తా పంత్‌కు ఉంది.  

మరోవైపు, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లో రాహుల్ వికెట్ కీపర్ గా రాణించినా తన బ్యాటింగ్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాగ్‌పూర్ లో కేవలం రెండు పరుగులు చేయగా కటక్ లో పది పరుగులు చేశాడు. అయితే, ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్  ఇప్పటికే జట్టులో ఉండటంతో పంత్‌​కి అది ప్రతికూలంగా మారవచ్చు.

రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్
భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ గురించి ఇంకా స్పష్టత లేక పోవడంతో.. అర్ష్‌దీప్  సింగ్ కి అవకాశం కల్పించే అవకాశం ఉంది.  గాయం నుంచి కోలుకొని జట్టులోకి  వచ్చిన సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంకా తన పూర్తి స్థాయి ఫామ్ కనిపించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వందేళ్లలో షమీ ప్రదర్శన అతని స్థాయికి తగ్గట్టుగా లేదు.

ఫలితంగా తన పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయలేక పోయాడు. ఈ కారణంగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేకు  పేస్ బౌలర్ హర్షిత్ రాణా  స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోవడం ఖాయం గా కనిపిస్తోంది. హర్షిత్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు వన్డేల నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేలో  కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆడే   అవకాశం ఉంది.

రేసులో వరుణ్ చక్రవర్తి 
ఇక కుల్దీప్ అవకాశం కల్పించిన ప్రతీ సారి తన వైవిధ్యమైన బౌలింగ్ తో రాణిస్తున్నాడు. ఈ కారణంగా అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే కుల్దీప్‌నకు వరుణ్ చక్రవర్తి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 

గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో వరుణ్ చక్రవర్తి తన  అద్భుతమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ భారత్ విజయానికి బాటలు వేస్తున్నాడు. ఈ కారణంగా భారత్  కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్ రౌండర్లయిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ లను కూడా జట్టులో తీసుకోనే అవకాశం ఉంది. 

చదవండి: తప్పు చేస్తున్నావ్‌ గంభీర్‌.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)