Breaking News

IND vs ENG: ఇంగ్లండ్‌ ప్రపంచ రికార్డు

Published on Sun, 07/19/2026 - 20:37

టీమిండియాతో మూడో వన్డేలో ఇంగ్లండ్‌ టాపార్డర్‌ అదరగొట్టింది. ఓపెనర్లు బెన్‌ డకెట్‌, జేకబ్‌ బెతెల్‌.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జో రూట్‌ భారత బౌలింగ్‌ను చితక్కొట్టారు. వీరికి తోడుగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఈ క్రమంలో క్రికెట్‌ ‘మక్కా’గా పేరొందిన లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కాగా సిరీస్‌ ఫలితాన్ని తేల్చే నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో డకెట్‌ భారీ శతకం (135 బంతుల్లో 141) సాధించగా.. బెతెల్‌ (93 బంతుల్లో 91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

ఇక జో రూట్‌ వన్డేల్లో వరుసగా ఆరో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 48 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (14) విఫలం కాగా బట్లర్‌ మెరుపులు మెరిపించాడు. కేవలం 13 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 41 పరుగులు రాబట్టాడు. రూట్‌తో కలిసి ఐదో వికెట్‌కు 19 బంతుల్లోనే 63 పరుగులు జోడించి అజేయంగా నిలిచాడు.

ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఇంగ్లండ్‌ కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 387 పరుగులు సాధించింది. వన్డేల్లో ఇంగ్లండ్‌కు టీమిండియాపై ఇదే అత్యధిక స్కోరు. అంతేకాదు క్రికెట్‌ పుట్టినిల్లు లార్డ్స్‌ మైదానంలో వన్డే ఫార్మాట్లో ఇదే హయ్యస్ట్‌ స్కోరు కావడం విశేషం. తద్వారా లార్డ్స్‌లో వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్‌ తమ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తాజాగా సవరించింది.

లార్డ్స్‌ మైదానంలో వన్డేల్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు ఇవే
👉ఇంగ్లండ్‌- 2026 జూలై 19న టీమిండియాపై 50 ఓవర్లలో 387/3
👉ఇంగ్లండ్‌- 1975 జూన్‌ 7న టీమిండియాపై 60 ఓవర్లలో 334/4
👉సౌతాఫ్రికా- 2025 సెప్టెంబరు 4న ఇంగ్లండ్‌పై 50 ఓవర్లలో 330/8
👉ఇంగ్లండ్‌- 2017 మే 7న ఐర్లాండ్‌పై 50 ఓవర్లలో 328/6
👉ఇండియా- 2002 జూలై 13న ఇంగ్లండ్‌పై 49.3 ఓవర్లలో 326/8.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)