Breaking News

Ind vs Eng- Vizag: రేపటి నుంచి ఆఫ్‌లైన్‌ టికెట్లు.. ధరలు ఇలా

Published on Thu, 01/25/2024 - 19:21

సాక్షి, విశాఖపట్నం: టీమిండియా- ఇంగ్లండ్‌ రెండో టెస్టుకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 26) నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టికెట్ల విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. 

ఇందులో భాగంగా ఫిబ్రవరి 6 వరకు పీఎం పాలెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం, ఫిబ్రవరి 1 వరకు స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లు విక్రయించనున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టికెట్లు విక్రయించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

తొలి రోజు టీమిండియాదే
కాగా.. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య గురువారం(జనవరి 25) తొలి టెస్టు ఆరంభమైంది.

స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ను 246 పరుగులకే ఆలౌట్‌ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ దూకుడుగా ఆడటంతో మొదటి రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్‌ నష్టానికి 119 పరుగులు చేసింది. మొత్తానికి తొలి రోజు పర్యాటక స్టోక్స్‌ బృందంపై రోహిత్‌ సేన పైచేయి సాధించింది.
 
ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న టికెట్ల ధరల వివరాలు..  
►రోజుకు రూ.100+సీజన్‌కు రూ.400                 
►రోజుకు రూ.200+సీజన్‌కు రూ.800                 
►రోజుకు రూ.300+సీజన్‌కు రూ.1,000             
►రోజుకు రూ.500+సీజన్‌కు రూ.1,500             
                                                                                
రోజుకు 2,850 మంది క్లబ్‌ క్రీడాకారులకు ఉచిత ఎంట్రీ.. 
రాష్ట్రంలో రోజుకు 2,850 మంది క్రికెట్‌ క్లబ్‌ క్రీడాకారులన చొప్పున ఐదు రోజులకు 14,250 మందికి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.   
 
రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ.. 
రోజుకు 2 వేల మంది చొప్పున ఐదు రోజులకు 10,000 మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీకి ఏర్పాట్లు చేశారు. అయితే విద్యార్థులు ఐడీ కార్డులు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.
 
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తక్కువ ధరలు.. 
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా లోయర్‌ పెవిలియన్‌ సీజన్‌ టికెట్లను విశాఖపట్నంలో కేవలం రూ. 1500లకు అందుబాటులో ఉంచినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

చదవండి: INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్‌కప్‌లో తమ్ముడి సెంచరీలు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు