Ind vs Eng: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ

Published on Mon, 01/29/2024 - 14:27

సాక్షి, విశాఖపట్నం: టీమిండియా – ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు నగరంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదిక కానుంది. ఫిబ్రవరి 2- 6 వరకు నిర్వహించనున్న ఈ మ్యాచ్‌ కోసం ఏర్పాట్లు చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు.

ఇరు జట్ల ఆటగాళ్లు జనవరి 30న విశాఖపట్నానికి చేరుకుంటారని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 3.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆటగాళ్ల వెంట మ్యాచ్‌ అధికారులు, ఇతర సిబ్బంది రానున్నట్లు వెల్లడించారు.

పనులన్నీ పూర్తి చేయాలి
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహణలో భాగంగా స్థానిక స్టేడియంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఏసీఏ ట్రెజరర్‌ ఎ.వి.చలంతో కలిసి గోపినాథ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్టేడియం లోపల, బయట చేపడుతున్న పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ
అదే విధంగా... వాహనాల పార్కింగ్‌ వద్ద తగిన సిబ్బందిని నియమించి ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గోపీనాథ్‌రెడ్డి ఆదేశించారు. రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్న దృష్ట్యా వారి ఐడీ కార్డులను పరిశీలించి స్టేడియంలోకి పంపాలన్నారు.

ఇక విద్యార్థులతో పాటు.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది రాష్ట్రంలో ఉన్న క్లబ్‌ క్రీడా కారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఉప్పల్‌ మ్యాచ్‌లో రోహిత్‌ సేన స్టోక్స్‌ బృందం చేతిలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టులో 0-1తో వెనుకబడింది.

చదవండి: శతక్కొట్టిన బెంగాల్‌ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు

Videos

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)