Breaking News

Ind vs Eng: ఎలా ఆడాలో నేర్చుకో గిల్‌: కుంబ్లే విమర్శలు

Published on Fri, 01/26/2024 - 15:45

India vs England, 1st Test: ఇంగ్లండ్‌తో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆట తీరుపై భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే పెదవి విరిచాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానంలో నిలదొక్కుకోవాలంటే గిల్‌ తన బ్యాటింగ్‌ టెక్నిక్‌ను మరింత మెరుగుపరచుకోవాలని సూచించాడు.

రాహుల్‌ ద్రవిడ్‌, ఛతేశ్వర్‌ పుజారాల మాదిరి ఆడితే ఈ యువ ప్లేయర్‌కు టెస్టుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో శుబ్‌మన్‌ గిల్‌ ఇబ్బంది పడుతున్నాడని... బలహీనతలు అధిగమించడంపై దృష్టి సారించాలని హితవు పలికాడు.

కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య గురువారం తొలి టెస్టు ఆరంభమైంది. ఉప్పల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన గిల్‌.. 66 బంతులు ఎదుర్కొని 23 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.

స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం నేర్చుకో
ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్లే బౌలింగ్‌లో బెన్‌ డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. చెత్త షాట్‌ సెలక్షన్‌తో వికెట్‌ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అనిల్‌ కుంబ్లే స్పోర్ట్స్‌ 18తో మాట్లాడుతూ గిల్‌ బ్యాటింగ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ.. గిల్‌ స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేకపోతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్‌ చేయాలో గిల్‌ నేర్చుకోవాలి. ఒకవేళ తను నంబర్‌ 3లోనే కొనసాగాలని కోరుకుంటే.. ముఖ్యంగా భారత పిచ్‌లపై వన్‌డౌన్‌లో నెగ్గుకురావాలనే సంకల్పంతో ఉంటే.. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలు రచించాలి.

ద్రవిడ్‌, పుజారాలా రాణించాలనుకుంటే
లేదంటే స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ పోవాలి. గురువారం అతడు బాగానే బ్యాటింగ్‌ చేశాడు. కానీ శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో చెత్త షాట్‌తో వికెట్‌ సమర్పించుకున్నాడు. నేను మళ్లీ చెప్తున్నా... పుజారా, ద్రవిడ్‌లా వన్‌డౌన్‌లో రాణించాలనుకుంటే కచ్చితంగా గిల్‌ స్ట్రైక్‌ రొటేట్‌ చేయాల్సిందే. స్పిన్‌ బౌలింగ్‌ ఆడేటపుడు మణికట్టును ఎక్కువగా ఉపయోగించాలి. షాట్ల ఎంపికలోనూ జాగ్రత్త వహించాలి’’ అని కుంబ్లే.. గిల్‌ ఆట తీరును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

చదవండి: ICC: అవార్డుల విజేతలు, జట్ల పూర్తి జాబితా! జింబాబ్వేకే ఆ పురస్కారం

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)