Breaking News

అతడిని కాదని నీకు ఛాన్స్‌.. ‘రాక రాక’ వచ్చిన అవకాశం! ఇకనైనా మారు..

Published on Sat, 09/16/2023 - 13:21

Suryakumar fails again in Asia Cup match vs Bangladesh: ఆసియా కప్‌-2023 టోర్నీలో రాక రాక వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకోయాడు టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 34 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై ఆటగాడు.. 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు మాత్రమే సాధించాడు. 

బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి వెనుదిరిగాడు. షాట్‌ సెలక్షన్‌లో తప్పిదంతో భారీ మూల్యం చెల్లించాడు. ఈ నేపథ్యంలో.. వన్డేల్లో సూర్య కంటే మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్‌ను కాదని.. అతడికి అవకాశం ఇచ్చిన బీసీసీఐపై అభిమానులు ఫైర్‌ అవుతున్నారు.

అతడిని కాదని నీకు ఛాన్స్‌
సంజూను కావాలనే పక్కనపెట్టి.. ఈ టీ20 నంబర్‌ 1 బ్యాటర్‌కు ఇంకెన్ని ఛాన్స్‌లు ఇస్తారని.. ఇకనైనా సెలక్టర్లు కళ్లు తెరవాలని చురకలు అంటిస్తున్నారు. వన్డే వరల్డ్‌కప్‌-2023 జట్టులో సూర్యకుమార్‌ను ఆడిస్తే ఫలితం అనుభవించక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.

ఏడేళ్లు బెంచ్‌ మీదే
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘ప్రస్తుతం సూర్య మైండ్‌సెట్‌ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నపుడు ఏడేళ్లు బెంచ్‌ మీదే కూర్చున్నా. ఐపీఎల్‌, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సూర్య స్ట్రైక్‌రేటు 170కి పైగా ఉంది. అయితే, వన్డేల్లో మాత్రం అతడు ఇంతవరకు తనను తాను నిరూపించుకోలేకపోయాడు.

అలాంటి మైండ్‌సెట్‌ మార్చుకో సూర్య
అందుకే ఎలాగైనా 50 ఓవర్‌ ఫార్మాట్‌లో రాణించి అభిమానుల నుంచి గౌరవం పొందాలనే ఒత్తిడిలో ఉన్నాడు. ఇలాంటి మైండ్‌సెట్‌ నుంచి సూర్య బయటపడాలి. విమర్శల గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే.. మనపై ప్రతికూల ప్రభావం అంత ఎక్కువగా పడుతుంది.

అభద్రతాభావం మనల్ని వెంటాడుతుంది’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌కు సలహాలు ఇచ్చాడు. ప్రపంచకప్‌లో సూర్య తప్పక రాణిస్తాడని తాను భావిస్తున్నానని.. అయితే ఈసారి తనను పూర్తిగా నిరాశపరిచాడని పేర్కొన్నాడు. 

వన్డేల్లో సంజూ గణాంకాలు ఇలా
కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 వన్డేల్లో సూర్య.. 24.41 సగటుతో 537 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్‌లో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్‌.. 13 వన్డేలాడి 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు.

చదవండి: SA Vs Aus: క్లాసెన్‌ సునామీ ఇన్నింగ్స్‌.. టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)