Breaking News

Asia cup 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ

Published on Wed, 09/24/2025 - 21:21

ఆసియా కప్‌ 2025లో (Asia cup 2025) అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 24) జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో (India vs Bangladesh) మరో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించాడు. 

ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అభి'షేక్‌' (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు సాధించడంతో అభిషేక్‌ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది.

ఆసియా కప్‌ టీ20 ఫార్మాట్‌లో విరాట్‌ కోహ్లి (Virat kohli) తర్వాత వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో  హాఫ్‌ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్‌ చరిత్రకెక్కాడు. ప్రస్తుత ఎడిషన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ ఇప్పటికే లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లు ఆడిన అతను.. 206.67 స్ట్రయిక్‌రేట్‌తో 248 పరుగులు చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి 3 ఓవర్లలో నిదానంగా ఆడినప్పటికీ.. ఆతర్వాత అభిషేక్‌ గేర్‌ మార్చడంతో ఒక్కసారిగా పుంజుకుంది. అభిషేక్‌, గిల్‌ క్రీజ్‌లో ఉన్నంత వరకు పరుగులు పెట్టిన స్కోర్‌ బోర్డు.. ఈ ఇద్దరు ఔట్‌ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది.

వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 15 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్‌ పాండ్యా (11), అక్షర్‌ పటేల్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ 75, గిల్‌ 29, శివమ్‌ దూబే 2, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, తిలక్‌ వర్మ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలరల్లో రిషద్‌ హొసేన్‌ 2, తంజిమ్‌ సాకిబ్‌, ముస్తాఫిజుర్‌ తలో వికెట్‌ తీశారు. అభిషేక్‌ శర్మ రనౌటయ్యాడు. 

చదవండి: సందిగ్దంలో సెలెక్టర్లు.. విండీస్‌ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన వాయిదా

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)