Breaking News

అమ్మను హత్తుకున్న మధురజ్ఞాపకం! ఆయన వల్లే ఇదంతా అంటూ భావోద్వేగం

Published on Thu, 02/09/2023 - 13:40

India vs Australia, 1st Test- KS Bharat: ‘‘నేను ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి వరకు చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. సుదీర్ఘ ప్రయాణంలో.. ఇప్పుడిలా.. నా టెస్టు జెర్సీని చూసిన క్షణాలు అత్యంత విలువైనవి. నాకిది గర్వకారణం! ఈ ప్రయాణం భావోద్వేగాలతో కూడుకున్నది’’ అంటూ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.

దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్ర జట్టుకు ఆడుతున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యుల నడుమ టీమిండియా క్యాప్‌ అందుకున్న భరత్‌.. తన తల్లిని హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. 

ఆయన వల్లే ఇదంతా..
ఈ నేపథ్యంలో భరత్‌ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘‘నేనిక్కడివరకు వచ్చానంటే అందుకు కారణం మా కోచ్‌ జై క్రిష్ణారావు. నాపై నాకు నమ్మకం లేని సమయంలో ఆయన నాపై విశ్వాసం ఉంచారు.

నిజానికి నాపై నాకంటే ఆయనకే ఎక్కువ నమ్మకం. ఆయన వల్లే ఇదంతా! ఒక్కరోజులో ఇదేమీ సాధ్యం కాలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను.

2018లో ఇంగ్లండ్‌తో ఇండియా-ఏ తరఫున ఆడినపుడు రాహుల్‌ సర్‌ నన్ను మొదటిసారి చూశారు. చాలా సేపు మేము మాట్లాడుకున్నాం. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడటమే నాకు ముఖ్యం. నేనెప్పుడూ అలాగే ఆలోచించాలని ఆయన నాతో చెబుతూ ఉంటారు’’ అని 29 ఏళ్ల కేఎస్‌ భరత్‌ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్‌ వికెట్‌.. రోహిత్‌, ద్రవిడ్‌ రియాక్షన్‌ మామూలుగా లేదుగా! వీడియో వైరల్‌
KS Bharat: కేఎస్‌ భరత్‌ అరంగేట్రం.. సీఎం జగన్‌ శుభాకాంక్షలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)