Breaking News

WTC: పిచ్‌లు చెత్తగా ఉంటే.. టీమిండియాదే సిరీస్‌.. కనీసం ఈసారైనా!

Published on Tue, 01/17/2023 - 16:35

India Vs Australia Test Series 2023: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియా- ఆస్ట్రేలియా మరోసారి టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. భారత్‌ వేదికగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడనున్నాయి. ఆఖరి ముఖాముఖి పోరులో ఆసీస్‌ గడ్డపై కంగారూలను చిత్తు చేసి 2-1తో సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

మరోవైపు.. స్వదేశంలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని ప్యాట్‌ కమిన్స్‌ బృందం భావిస్తోంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ చేరిన ఆసీస్‌.. ఆఖరి సిరీస్‌లోనూ గెలిచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. 

ఫైనల్‌ చేరాలంటే..
ఇక కంగారూ జట్టుతో సొంతగడ్డపై జరుగనున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా.. టీమిండియా సైతం డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరుతుంది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ ఇయాన్‌ హీలే సంచలన వ్యాఖ్యలు చేశాడు. రేడియో ప్రోగ్రామ్‌లో అతడు మాట్లాడుతూ.. ‘‘వాళ్లది గొప్ప జట్టే. అయితే, చెత్త పిచ్‌లు రూపొందించనంత వరకు వాళ్ల స్పిన్నర్లకు పెద్దగా భయపడాల్సిన పనిలేదు. 

పిచ్‌లు అలా ఉంటే టీమిండియాదే సిరీస్‌
గతంలో మాదిరి ఇప్పుడు కూడా అదే తరహా పిచ్‌లు తయారు చేస్తే మేము(ఆస్ట్రేలియా) గెలవం. ఇది తథ్యం. నాసికరం పిచ్‌ల ​కారణంగా స్పిన్నర్లు చెలరేగడంలో పెద్దగా వింతేమీ ఉండదు. ఒకవేళ అలా కాకుండా మెరుగైన పిచ్‌లు రూపొందిస్తే.. ఫ్లాట్‌ బ్యాటింగ్‌ వికెట్లపై బౌలింగ్‌ చేయడానికి బౌలర్లు శ్రమించాల్సి వస్తుంది. అప్పుడు మా పని సులువవుతుంది. స్టార్క్‌ దూరం కావడం(​మొదటి టెస్టు) కచ్చితంగా ప్రభావం చూపుతుంది..

ఇండియా 2-1తో గెలుస్తుందనే నా అంచనా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 9- మార్చి 13 వరకు టీమిండియా- ఆసీస్‌ టెస్టు సిరీస్‌ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరు బోర్డులు జట్లను ప్రకటించాయి. ఈసారి ఆస్ట్రేలియా నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగనుంది. ఇక స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. కాగా ఐదేళ్ల క్రితం ఆసీస్‌ టెస్టు సిరీస్‌ కోసం భారత పర్యటనకు రాగా2-1తో ఓటమి పాలైంది.

చదవండి: స్టీవ్‌ స్మిత్‌కు పూనకం వచ్చింది.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు
Virat Kohli: కోహ్లి అతడి కోసం త్యాగం చేయాలి! గతంలో రాయుడు కోసం ఇలాగే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)