Breaking News

Ind Vs Aus: స్మిత్‌ రికార్డు బద్దలు కొట్టిన ఖవాజా.. అరుదైన ఘనత

Published on Fri, 03/10/2023 - 17:10

India vs Australia, 4th Test- Usman Khawaja: ఆస్ట్రేలియా బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజాకు ఈసారి భారత పర్యటన అతడి కెరీర్‌లోనే చిరస్మరణీయంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. గతంలో రెండుసార్లు ఇక్కడికి వచ్చిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేవలం డ్రింక్స్‌ అందించేందుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 ఆరంభానికి ముందే తుదిజట్టులో చోటు ఖాయం కాబట్టి.. తనదైన మార్కు చూపించాలని ఆరాటపడ్డాడు.

అయితే, మొదటి టెస్టులో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్‌ అయిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే పరిమితమయ్యాడు. ఢిల్లీ టెస్టుతో పుంజుకున్న అతడు.. మొత్తంగా 87 పరుగులు సాధించాడు. ఇక ఇండోర్‌ టెస్టులో 60 పరుగులతో సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక సిరీస్‌ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఉస్మాన్‌ ఖవాజా మరోసారి బ్యాట్‌ ఝులిపించాడు. అయితే, ఈసారి ఏకంగా సెంచరీ బాది జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. పట్టుదలగా నిలబడి 422 బంతులు ఎదుర్కొని 180 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఖవాజా అరుదైన ఘనత సాధించాడు.

స్మిత్‌ రికార్డు బద్దలు
అహ్మదాబాద్‌ టెస్టులో 180 పరుగులు సాధించిన ఖవాజా భారత గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో స్మిత్‌ను వెనక్కినెట్టాడు. 

భారత్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆసీస్‌ బ్యాటర్లు
1. డీన్‌ జోన్స్‌- 1986- చెన్నైలో- 210
2. మాథ్యూ హెడెన్‌-2001- చెన్నైలో- 203
3. ఉస్మాన్‌ ఖవాజా- 2023- అహ్మదాబాద్‌-180
4. స్టీవ్‌ స్మిత్‌- 2017- రాంచిలో- 178 నాటౌట్‌.

చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు
Ind Vs Aus: కోహ్లి కెప్టెన్సీలో ఏడేళ్లలో రెండుసార్లు! రోహిత్‌ సారథ్యంలో 24 గంటల్లోనే రెండుసార్లు! ఇంత ఘోరమా?
23 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా.. అంతా వాళ్ల వల్లే! అదే జరిగితే టీమిండియా..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)