Breaking News

రోహిత్‌- కోహ్లి ఆడతారా?.. స్పందించిన టీమిండియా కోచ్‌

Published on Thu, 06/04/2026 - 19:20

అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అందుబాటులో ఉంటారా? లేదా?.. క్రికెట్‌ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. ఐపీఎల్‌-2026లో కోహ్లి అదరగొట్టిన సంగతి తెలిసిందే.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లలో కలిపి 675 పరుగులు సాధించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.

అంతలోనే గాయమా?
ఇక ఆర్సీబీ రెండోసారి టైటిల్‌ విజేతగా అవతరించిన తరుణంలో కోహ్లి సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అనుష్క శర్మ, సహచర ఆటగాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా డాన్స్‌ చేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే, అంతలోనే కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడనే వార్త బయటకు వచ్చింది.

ఫలితంగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లి దూరమయ్యాడనే వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు.

రోహిత్‌ కూడా డౌటే
ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ సైతం సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే తాజాగా స్పందించాడు. అఫ్గనిస్తాన్‌తో టీమిండియా ఏకైక టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ..

కోచ్‌ ఏమన్నాడంటే..
‘‘ఇప్పటి వరకు మాకు కూడా అధికారిక సమాచారం అందలేదు. విరాట్‌, రోహిత్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు గాయాల వల్ల దూరవుతున్నారంటే అది నిజంగా పెద్ద వార్తే. అయితే, ఏ ఆటగాడి విషయంలోనైనా ప్రొటోకాల్‌ ఒకేలా ఉంటుంది.

వాళ్లు ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నారా? లేరా? అన్నది మా వైద్య బృందం నిర్ణయిస్తుంది. వారి సూచన ప్రకారమే రో-కోలను ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.

ఒకవేళ వాళ్లు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేసే అంశంపై కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని డష్కాటే తెలిపాడు. కాగా జూన్‌ 6- 20 మధ్య టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. 

ఏం జరుగుతోంది?
ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రో-కో గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. 

చదవండి: ‘పంజాబ్‌ కింగ్స్‌ ఈ ఐదుగురిని వదిలేయాలి’

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)