అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

Published on Wed, 06/17/2026 - 17:34

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌- ‘ఎ’ జట్టు తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడేసింది. దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌- ‘ఎ’తో బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్‌ వర్మ సేన 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నెట్‌రన్‌రేటు భారీగా మెరుగుపరుచుకుని ఫైనల్‌ చేరుకుంది.

వరుసగా రెండు ఓటములు
శ్రీలంక వేదికగా ఆతిథ్య జట్టుతో భారత్‌- ‘ఎ’, అఫ్గాన్‌ - ‘ఎ’ జట్లు ముక్కోణపు వన్డే సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత శ్రీలంకపై గెలిచిన భారత్‌.. తదుపరి మ్యాచ్‌లో అఫ్గాన్‌ చేతిలో ఓడిపోయింది. అనంతరం శ్రీలంకతో మరో మ్యాచ్‌ ఆడగా.. సూపర్‌ ఓవర్‌లో తిలక్‌ వర్మ సేనకు భంగపాటే ఎదురైంది.

319 పరుగులు
ఈ క్రమంలో ఫైనల్‌ రేసులో నిలవాలంటే అఫ్గాన్‌పై బుధవారం నాటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించింది.

ఓపెనర్లలో ప్రియాన్ష్‌ ఆర్య అర్ధ శతకం (58)తో రాణించగా.. వైభవ్‌ సూర్యవంశీ (38) ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌ 30 పరుగులు చేయగా.. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (59), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుమార్‌ కుశాగ్ర (58) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు.

సూర్యాంశ్‌ షెడ్గే (7) విఫలం కాగా.. నిశాంత్‌ సింధు (21 నాటౌట్‌), విప్రాజ్‌ నిగమ్‌ (30) మెరుగ్గా రాణించారు. ఫలితంగా భారత్‌ మంచి స్కోరు సాధించింది. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరీదూన్‌ దావూద్జాయ్‌, అబ్దుల్లా అహ్మద్జాయ్‌, ఫర్మానుల్లా సఫీ రెండేసి వికెట్లు కూల్చగా.. జహీర్‌ ఖాన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

చెలరేగిన నిశాంత్‌ సింధు
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌కు ఆరంభంలోనే షాకులు తగిలాయి. టాపార్డర్‌లో ఓపెనర్‌ హసన్‌ ఐసాఖిల్‌ (14), వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఖలీద్‌ తనీవాల్‌ (13) ఇలా వచ్చి అలా వెళ్లారు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ ఇమ్రాన్ మిర్‌ 32 పరుగులతో ఫర్వాలేదనిపించారు.

మిగిలిన వారిలో ఫైజల్‌ షినోజాదా (46), బహీర్‌ షా (57) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మహ్మద్‌ ఇషాక్‌ (16), ఫర్మానుల్లా సఫీ (17లతో పాటు షామ్స్‌ ఉర్‌ రహ్మాన్‌ (8), అబ్దుల్లా అహ్మద్జాయ్‌ (6), జహీర్‌ ఖాన్‌ (4) భారత బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఫైనల్‌కు దూసుకువెళ్లిన భారత్‌
ఈ క్రమంలో 36.5 ఓవర్లలో 218 పరుగులకే అఫ్గానిస్తాన్‌ ఆలౌట్‌ అయింది. ఫలితంగా భారత్‌ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో నిశాంత్‌ సింధు నాలుగు వికెట్లతో చెలరేగగా.. యశ్‌ ఠాకూర్‌ రెండు, అన్షుల్‌ కాంబోజ్‌, విప్రాజ్‌ నిగమ్‌, సూర్యాంశ్‌ షెడ్గే, అనుకుల్‌ రాయ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

ఇక ఈ విజయంతో భారత్‌ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయి. నెట్‌రన్‌రేటు +0.797. మిగిలిన ఒక్క లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక- అఫ్గానిస్తాన్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. గెలిచిన జట్టు భారత్‌తో ఫైనల్లో తలపడుతుంది.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీకి షాకిచ్చిన బీసీసీఐ

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)