Breaking News

అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనత

Published on Sun, 09/13/2026 - 20:31

అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20తో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ పేస్‌గుర్రం.. బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొంది పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ పరీక్ష పాసైన బుమ్రా ఆదివారం నాటి మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఢిల్లీ వేదికగా టీమిండియాకు అఫ్గాన్‌ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

రెండో బంతికే వికెట్‌
ఈ క్రమంలో బౌలింగ్‌ అటాక్‌ మొదలుపెట్టిన బుమ్రా వైడ్‌తో ఆరంభించినప్పటికీ.. రెండో బంతికే అఫ్గాన్‌ ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ను అవుట్‌ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి గుర్బాజ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

కాగా టీ20 ఫార్మాట్లో బుమ్రాకు ఇది 350 వికెట్‌ కావడం విశేషం. తద్వారా పొట్టి క్రికెట్‌లో 350 వికెట్ల క్లబ్‌లో చేరిన మూడో భారత బౌలర్‌గా ఈ రైటార్మ్‌ పేసర్‌ నిలిచాడు. అంతకు ముందు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఈ ఘనత సాధించారు.

టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లు
యజువేంద్ర చహల్‌- 396 వికెట్లు (హర్యానా, టీమిండియా, ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, ఆర్సీబీ )
భువనేశ్వర్‌ కుమార్‌- 363 వికెట్లు (ఉత్తరప్రదేశ్‌, టీమిండియా, ఇండియా-ఎ, పూణే వారియర్స్‌, ఆర్సీబీ, సన్‌రైజర్స్‌, )
జస్‌ప్రీత్‌ బుమ్రా - 350 వికెట్లు* (గుజరాత్‌, టీమిండియా, ముంబై ఇండియన్స్‌).

అఫ్గాన్‌ స్కోరు ఎంతంటే
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్‌ డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్‌ (11) విఫలమయ్యాడు. మిగతా వారిలో సెదీకుల్లా అటల్‌ (13) నిరాశపరచగా.. గుల్బదిన్‌ నైబ్‌ (2), డార్విష్‌ రసూలీ (2) తేలిపోయారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ హాఫ్‌ సెంచరీ (44 బంతుల్లో 64) చేయగా.. మహ్మద్‌ నబీ 33 పరుగులతో రాణించాడు. దీంతో అఫ్గాన్‌ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తికి తలా ఒక వికెట్‌ దక్కింది.
 

చదవండి: షఫాలీ మెరుపు హాఫ్‌ సెంచరీ

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)