Breaking News

అఫ్గన్‌తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్‌

Published on Sat, 06/13/2026 - 17:19

ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్‌ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్‌ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి.

అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్‌కు గ్రౌండ్‌ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్‌ పడింది. టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

ఆ ఇద్దరి అరంగేట్రం
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్‌ పాత బడే కొద్ది బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్‌ తెలిపాడు. అదే విధంగా హర్ష్‌ దూబే, గుర్నూర్‌ బ్రార్‌ ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. 

కాగా విరాట్‌ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్‌ జోడీగా గిల్‌- రోహిత్‌ శర్మ కొనసాతుండగా.. వన్‌డౌన్‌లో కేఎల్‌ రాహుల్‌ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌ సేవలు అందించనున్నాడు. 

మరోవైపు.. హార్దిక్‌ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్‌కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఇక సీనియర్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్‌ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్‌ దళంలో అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణతో కలిసి గుర్నూర్‌ బ్రార్‌ బరిలోకి దిగుతున్నాడు.

భారత తుదిజట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, నితీశ్‌ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

అఫ్గనిస్తాన్‌ తుదిజట్టు
ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్‌ ఘజన్‌ఫర్‌, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)