Breaking News

World Cup 2025: పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

Published on Fri, 10/03/2025 - 08:39

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో (Women's World Cup 2025) సంచలనం నమోదైంది. పాకిస్తాన్‌ను (Pakistan) వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్‌ (Bangladesh) చిత్తుగా ఓడించింది. కొలొంబో వేదికగా నిన్న (అక్టోబర్‌ 2) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌.. బంగ్లా బౌలర్ల ధాటికి 389.3 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది.

షోర్నా అక్తర్‌ 3, మరుఫా అక్తర్‌, నహిద అక్తర్‌ చరో 2, నిషిత అక్తర్‌, ఫహీమా ఖాతూన్‌, రబేయా ఖాన్‌ తలో వికెట్‌ తీసి పాక్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు.

పాక్‌ ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన రమీన్‌ షమీమ్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. కెప్టెన్‌ ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), అలియా రియాజ్‌ (13), సిద్రా నవాజ్‌ (15), డయానా బేగ్‌ (16 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమైమా సోహైల్‌, సిద్రా అమీన్‌ డకౌట్లయ్యారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 31.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రుబ్యా హైదర్‌ (54) అజేయ అర్ద సెంచరీతో బంగ్లాదేశ్‌ను గెలిపించింది. 

కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా (23), శోభన మోస్తరి (24 నాటౌట్‌) రుబ్యాకు సహకరించారు. పాక్‌ బౌలర్లలో ఫాతిమా సనా, డయానా బేగ్‌, రమీన్‌ షమీమ్‌కు తలో వికెట్‌ దక్కింది. కాగా, ఈ టోర్నీలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 5న కొలొంబో వేదికగా జరుగనుంది.

చదవండి: IND VS WI 1st Test: ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసిన బుమ్రా

 

 

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి