Breaking News

ICC: అగ్రపీఠానికి చేరువైన రూట్‌.. భారీ జంప్‌ కొట్టిన బ్రూక్‌

Published on Wed, 07/24/2024 - 16:57

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు సత్తా చాటారు. వెటరన్‌ క్రికెటర్‌ జో రూట్‌ అగ్రస్థానానికి చేరువకాగా.. యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకు సాధించాడు. అదే విధంగా.. బెన్‌ డకెట్‌ ఆరు స్థానాలు మెరుగుపరచుకుని టాప్‌-20(16వ ర్యాంకు)లో అడుగుపెట్టగా.. ఓలీ పోప్‌ 8 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకులో నిలిచాడు.

విండీస్‌ను చిత్తు చేసి
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడే నిమిత్తం వెస్టిండీస్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 114 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తూ 241 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

ఈ విజయంలో జో రూట్‌ కీలక పాత్ర పోషించాడు. కెరీర్‌లో 32వ టెస్టు సెంచరీ(122 రన్స్‌) నమోదు చేశాడు. ఫలితంగా 12 రేటింగ్‌ పాయింట్లు మెరుగుపరచుకున్న జో రూట్‌.. టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.

అగ్రపీఠానికి చేరువైన రూట్‌
నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న న్యూజిలాండ్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌ పీఠంపై కన్నేశాడు. మరో ఏడు రేటింగ్‌ పాయింట్లు సాధిస్తే రూట్‌ అగ్రస్థానానికి ఎగబాకుతాడు. విండీస్‌తో మిగిలి ఉన్న మూడో టెస్టులోనూ సత్తా చాటితే ఇదేమంత కష్టం కాదు.

భారీ జంప్‌ కొట్టిన బ్రూక్‌
ఇక 25 ఏళ్ల హ్యారీ బ్రూక్‌ సైతం వెస్టిండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ(109)తో కదంతొక్కాడు. ఈ క్రమంలో నాలుగు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు అందుకున్నాడు. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం, న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌, ఆస్ట్రేలియా వెటరన్‌ ప్లేయర్‌ స్టీవెన్‌ స్మిత్‌లను వెనక్కి నెట్టి టాప్‌-3లోకి దూసుకువచ్చాడు.

కాగా ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(7వ ర్యాంకు), అతడి ఓపెనింగ్‌ జోడీ యశస్వి జైస్వాల్‌(8వ ర్యాంకు), విరాట్‌ కోహ్లి(10వ ర్యాంకు) టాప్‌-10లో కొనసాగుతున్నారు.

ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే
1. కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌)- 859 రేటింగ్‌ పాయింట్లు
2. జో రూట్‌(ఇంగ్లండ్‌)- 852 రేటింగ్‌ పాయింట్లు
3. హ్యారీ బ్రూక్‌(ఇంగ్లండ్‌)- 771 రేటింగ్‌ పాయింట్లు
4. బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)- 768 రేటింగ్‌ పాయింట్లు
5. డారిల్‌ మిచెల్‌(న్యూజిలాండ్‌)- 768 రేటింగ్‌ పాయింట్లు.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)