Breaking News

టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్

Published on Tue, 02/10/2026 - 00:11

భారత్‍-శ్రీలంక వేదికగా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌-2026 జరుగుతోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా.. మన దేశానికి రాకూడదని బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవడంతో.. బంగ్లా జట్టు ప్రపంచకప్ నుంచి తప్పుకొంది. దీని స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలో అడుగుపెట్టింది. 

మరోవైపు ఫిబ్రవరి 15వ తేదీన భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ మీటింగ్ జరగ్గా.. ఇందులో బంగ్లాదేశ్ జట్టుకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనకపోవడంపై నిరాశ వ్యక్తం చేసిన ఐసీసీ.. ప్రస్తుత అంశానికి సంబంధించి బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడాపరమైన, పరిపాలానా జరిమానా విధించబోమని ధ్రువీకరించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు.. బంగ్లా బోర్డుకి ఉందని స్పష్టం చేసింది.

దీని వల్ల ఆ హక్కుకి ఎలాంటి భంగం కలగదని, అది యధాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. అలానే బంగ్లాదేశ్‌లో 2031 పురుషుల ప్రపంచకప్ జరగడానికి ముందు ఓ ఐసీసీ ఈవెంట్‌కి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన ప్రకటనలో తెలియజేసింది.

ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లో పాల్గొనాలని పాక్ జట్టుని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. భారత్‌లో కాకుండాశ్రీలంకలో తమ మ్యాచ్‌లని నిర్వహించాలనే అభ్యర్థనని ఐసీసీ తిరస్కరించిన తర్వాత.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ సమయంలో తమకు మద్ధతుగా నిలిచిన పాకిస్తాన్‌కి బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం కృతజ్ఞతలు చెప్పారు.

Videos

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు