Breaking News

బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌

Published on Wed, 01/07/2026 - 11:19

భారత్‌లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో తమ మ్యాచ్‌లను ఇతర దేశానికి మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్, వేదికల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. భారత్‌లో ఆడకపోతే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఈ విషయాలను ఐసీసీ వర్చువల్ సమావేశం ద్వారా బీసీబీకి తెలియజేసినట్లు సమాచారం.  

అసలేం జరిగిందంటే..?
ఐపీఎల్‌ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రతరమయ్యాయి. కొన్ని రాజకీయ ప్రేరేపిత శక్తులు ఏకంగా ఆరుగురు హిందువులను కిరాతకంగా చంపేశాయి.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశీ ప్లేయర్‌ను ఐపీఎల్‌లో ఆడించకూడదని భారత్‌లో నిరసనలు వెల్తువెత్తాయి. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగి ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తొలగించాలని కేకేఆర్‌కు అల్టిమేటం జారీ చేసింది. తప్పేదేమీ లేక కేకేఆర్‌ ముస్తాఫిజుర్‌ను కాంట్రాక్ట్‌ నుంచి తొలిగించింది.

తమ దేశ ఆటగాడిని ఐపీఎల్‌ నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్‌ చేసింది. భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌-2026 గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అలాగే తమ దేశానికి చెందిన అంపైర్లు భారత్‌లో జరిగే ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనరని స్పష్టం చేసింది.

ప్రపంచకప్‌ మ్యాచ్‌ల వేదికల మార్పుకు ఐసీసీ ససేమిరా అంటున్న నేపథ్యంలో  బీసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్‌ సాహసం చేసి భారత్‌లో మ్యాచ్‌లు ఆడకపోతే, ఆ దేశ క్రికెట్‌ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)